శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Aug 15, 2020 , 00:09:07

కేతనానికి అభివందనం

కేతనానికి అభివందనం

జీవనదుల  గలగలల రవళులతో

సతత హరిత తరువుల హొయలతో

గర్భ కుహరంలో దాచిన నిధులతో

విలసిల్లిన అందాల భరతావని- నా దేశం

పరాయి పాలనలో విచ్ఛిన్నమైన కలల పూరేకులు

స్వాతంత్య్రమే ధ్యేయమై

ఆలపించిన యుద్ధ గీతిక

ఆనాటి ప్రజల అనంత చైతన్య దీపిక- నా భూమి

గగనతలంలో రెపరెపలాడే త్రివర్ణ పతాకం

వీరులు, త్యాగధనుల ప్రాణార్పణకు ప్రతీక- నా జెండా

కవ్వించే శత్రువుల గుండెల్లో

ప్రతిధ్వనించే రణనినాదమై

దేశభక్తియే అణువణువున నిండిన విస్ఫోటనమై

ధరణిని అనవరతం రక్షించే తంత్రం- నా ధర్మం 

భిన్నత్వంలో ఏకత్వంతో

విశ్వ యవనికపై చెరగని చిరునామాయై నిలిచిన

 నా మాతృభూమికి వందనం!

నా కేతనానికి అభివందనం!!

రామా రత్నమాల, 9885700062


logo