శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 13, 2020 , 23:43:16

గుండెలనిండా మువ్వన్నెల జెండా!

గుండెలనిండా మువ్వన్నెల జెండా!

ముచ్చటగా మూడుదిక్కులా జలం

ఉత్తరాన దీటుగా ఆసేతు హిమాచలం

నలుదిక్కులా శత్రుదుర్భేద్యమైన

రక్షణ వలయం నా దేశం!

త్యాగధనుల త్యాగనిరతికి

ఆనవాలు నా దేశం!

పరాధీన శృంఖలాలు తెంచుకున్న

నా దేశ వటవృక్షానికి

భిన్న జాతులే.. 

అక్కున చేర్చుకునే కొమ్మలయినాయి

విభిన్న మతాలే..

నీడనిచ్చి ఆకలితీర్చే ఫలాలయ్యాయి

వివిధ సంస్కృతులే..

పరిమళాలు పంచే పత్రాలయ్యాయి

పల్లె పైరుగాలి వింజామరలతో

పట్టణ సాంకేతిక పరిజ్ఞాన సౌరభాలతో

అభివృద్ధే ధ్యేయంగా

భాసిల్లుతోంది నా దేశం!

కళలకు కాణాచియై కాంతులు వెదజల్లి

విశ్వ వినువీధిలో..

రెపరెపలాడింది నా జెండా

ప్రతి భారతీయుని మది నిండా!!


logo