సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 29, 2020 , 00:00:32

వేల్పుగిడ్డి సినారె

వేల్పుగిడ్డి సినారె

నవ్యసాహితీ వనంలో

‘నవ్వని పువ్వు’ను పూయించి

‘నాగార్జునసాగర్‌' కావ్యాన్ని నిర్మించి

‘కర్పూర వసంతరాయలు’గా గుబాళించి

‘వెన్నెలవాడ’లో వేడుకగా విహరించి

వెండితెర గీతాలతో ప్రకాశించి

‘అక్షరాల గవాక్షాల’లోంచి

‘మధ్యతరగతి మందహాసాల్ని’ వీక్షించి

‘మంటలూ-మానవుడు..’ అంటూ

మహనీయ పురస్కారాలతో ప్రజ్వలించి

‘విశ్వంభర’తో జ్ఞానపీఠాన్ని అధివసించి

కవిగానే గాక, వీసీగా-ఎంపీగా ఎనలేని ఖ్యాతిగడించి

అభినవ కవిసార్వభౌముడిగా రాణించి

అమరత్వం పొందిన

ఆచార్య సి.నారాయణరెడ్డి

అశేష శిష్యుల పాలిటి వేల్పుగిడ్డి!

పటుతర భావాల పసిడికడ్డి!!


logo