మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 25, 2020 , 23:24:27

ఎవరి తీరు వారికి!

ఎవరి తీరు వారికి!

యస్మిన్‌ యథా వర్తతే యోమనుష్యః

తస్మిన్‌ తథా వర్తితవ్యం సధర్మః

మాయాచారో మాయయా వారణీయః

సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః

ఎదుటివారు మనతో ఎలా ప్రవర్తిస్తారో, మనం కూడా వారితో అలాగే ప్రవర్తించాలి. మోసం చేసే స్వభావం కలవారిని యుక్తితోనే ఎదుర్కోవాలి. సత్ప్రవర్తన కలవారితో మంచిగా మెలగాలి. దుర్మార్గుల వల్ల, మోసగాళ్ల వల్ల కష్టనష్టాలకు గురైనప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం వల్ల సమాజం మనల్ని అసమర్థులుగా భావించే ప్రమాదం ఉంటుంది.

టి.సుధాకరశర్మ


logo