గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 23, 2020 , 23:43:54

నవతరం నాయకుడు

నవతరం నాయకుడు

గత ఫిబ్రవరి మధ్యలో అనుకుంటా. మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చేసరికి బి.టెక్‌ చదువుతున్న పెద్దోడు, వాడి ఫ్రెండ్స్‌ గదిలో కూర్చుని టీవీ చూస్తున్నారు. లోపలికి వెళ్లి గమనిస్తే అంతకు ఒకటి రెండు రోజుల ముందు టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో కేటీఆర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూని వాళ్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతా 20 ఏళ్ల వాళ్లే. అదేమైనా వాళ్ల ఇంటరెస్టింగ్‌ సబ్జెక్టా అంటే.. రోల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ ఇన్‌ బిల్డింగ్‌ ఇండియా అనే టాపిక్‌! అంతా అయిపోయాక.. ఏం చూసినారు? అని అడిగితే...  కేటీఆర్‌ గారు ప్రతి వారం ఇలాంటి డిస్కషన్స్‌లో పార్టిసిపేట్‌ చేస్తే బాగుంటుంది కదా అంకుల్‌ అన్నాడు ఒక పిల్లాడు. ఎందుకూ అంటే మేం కేటీఆర్‌ ఫ్యాన్స్‌ అన్నాడు. ఆయన ఇంగ్లిష్‌  సూపర్‌ కదా అన్నాడు మరొకడు. మేం రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాం అంకుల్‌ అన్నాడు ఇంకో కుర్రాడు. ఆయన డిస్కషన్స్‌ బాగుంటాయి, వియ్‌ కెన్‌ లెర్న్‌ సమ్‌థింగ్‌ అంది ఒక అమ్మాయి. కేటీఆర్‌లో వాళ్లు తమను తాము చూసుకున్నట్టు అనిపించింది నాకు!

క్రికెటర్లకు, సినిమా హీరోలకు ఫ్యాన్స్‌ ఉండటం సహ జం. కొన్ని రాష్ర్టాల్లో యువ నాయకులకు యువతలో ఫాలోయింగ్‌ ఉన్నా అన్‌ ఎడ్యుకేటెడే ఎక్కువ. కానీ రాజకీయ నాయకుడిగా మారిన ఒక ఎడ్యుకేటెడ్‌కి, చదువుకునే పిల్లలు, టెకీస్‌, ప్రొఫెషనల్స్‌ ఫ్యాన్స్‌గా ఉండడం కొంత ఆశ్చర్యకరమే. పాతతరం పాలిటిక్స్‌ ప్రజా సేవకు సంకేతమైతే, నిన్నామొన్నటి  రాజకీయాలు పెద్దగా చ దువు అబ్బని వారి వృత్తి. ఈ సమయంలో తెలంగాణపై ఉన్న ప్రేమ, ఉద్యమ రూపంలో అనేకమంది విద్యాధికుల్ని, నాయకులుగా అందించింది. అలాంటివారిలో కేటీఆర్‌ ఒకరు. 

నాయకుడంటే ఖడక్‌ ఖద్దర్‌ అంగీ వేసుకుని, హడావుడి చేస్తూ, ఆర్భాటంగా ఇన్నోవా నుంచి దిగే వాతావరణంలో, అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌లా టీషర్ట్‌, ప్యాంటు, కోటు- టై కట్టుకుని కనిపించే కేటీఆర్‌ యువతరానికి కొత్త ప్రేరణ!


నేటి తరంలో ఒక వైరుధ్య ధోరణి ఉంటుంది. వాళ్లు పాష్‌గా కనిపిస్తారు. కానీ సింపుల్‌గా బిహేవ్‌ చేస్తారు. నో చెప్పాలనుకున్నా పూర్తి క్లారిటీతో, పెదవుల మీద చిరునవ్వు చెదరకుండానే చెప్తారు! ఆర్గ్యుమెంట్‌కి మొహమాటపడరు. కానీ మర్యాద పాటిస్తారు.  నేను అటో ఇటో ఎందుకుండాలి. నాలాగా నేనుంటే తప్పేంటి? అనే రెబెల్‌ మనస్తత్వం అవ్యక్తంగానే దాగి ఉంటుంది. ఫెయిర్‌గా ఉండి సాధించలేమా అనే తపన ఉంటుంది. ఇది ఇట్లాగే ఎందుకుండాలి, కాంట్‌ వియ్‌ చేంజ్‌? అనే క్వెస్ట్‌, జీల్‌ ఉంటుంది.  తలచుకుంటే తప్పక సాధించగలమనే డిటర్మినేషన్‌ ఉంటుంది. టెక్నాలజీపై ఇంట్రెస్ట్‌ ఉంటుంది. రేషనల్‌ థింకింగ్‌ అనుసరిస్తారు. ప్రాక్టికల్‌గా ఉండాలనుకుంటారు. కేటీఆర్‌లోనూ ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే నేటి ఎడ్యుకేటెడ్‌ యూత్‌ ఎక్స్‌పెక్టేషన్‌ని సాటిస్‌ఫై చేసే రాజకీయ రోల్‌ మోడల్‌గా మారారాయన!  కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చోవడం నుంచి, పోడియం ముందు తడబడకుండా మాట్లాడేదాకా  డిఫరెంట్‌ ైస్టెల్‌. కాన్ఫిడెన్స్‌కి సంకేతం. హై స్టాండర్డ్‌ ఫిగరేటివ్‌ ఇంగ్లిష్‌, మంచి ఈజ్‌తో కూడిన యాక్సెంట్‌, థాట్‌ క్లారిటీతో కూడిన ప్రజెంటేషన్‌, ఇంటర్నేషనల్‌ డెలిగేషన్‌నైనా, నేషనల్‌ చానెల్‌ డిబేట్‌నైనా కాన్ఫిడెన్స్‌తో కట్టిపడేసే తీరు, ఇంటర్వ్యూయర్‌ క్వశ్చన్స్‌ని కూడా సరిచేసే కౌంటర్‌ నాలెడ్జ్‌... ఇవన్నీ ఆయనలో యూత్‌ని అమితంగా ఆకట్టుకునే అంశాలు. 

రాజకీయాలు మన కప్‌ ఆఫ్‌ టీ కాదని, విసుక్కుని దూరంగా ఉండే ఎడ్యుకేటెడ్‌ యూత్‌కి, టెకీస్‌కి, టీజేజర్లకి, ఒక పొలిటికల్‌ లీడర్‌ రోల్‌మోడల్‌ కావడం అంత ఈజీ కాదు. దిస్‌ ఈజ్‌ ఎంటైర్లీ డిఫరెంట్‌ ఫ్రమ్‌ అదర్‌ స్టేట్స్‌!


దాదాపు 15 ఏళ్ల లాంగ్‌ బ్యాటిల్‌ తెలంగాణ ఉద్యమం, గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ని తిరుగులేని శక్తిగా మార్చింది. కానీ రాష్ట్రం వచ్చే నాటికి కూడా హైదరాబాద్‌ నగరం పూర్తిగా చేజిక్కలేదన్నది ఫ్యాక్ట్‌. ఆంధ్రాతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు హైదరాబాద్‌లో ఉండడం, ఒకప్పటి తెలంగాణ రాజధాని కాలక్రమేణా కాస్మొపాలిటన్‌ నగరంగా మారడం ఇందుకు కారణం. భారత్‌- ఇండియా ఎట్లాగో... తెలంగాణ- హైదరాబాద్‌ అట్లాగ!  నిజం చెప్పాలంటే  హైదరాబాదీలకు తెలంగాణ వాసులుగా కన్నా హైదరాబాదీలుగా పిలిపించుకోవడమే ఇష్టం. అలా ఉండటం వారికి అవసరం కూడా. తెలంగాణ వస్తే ఏమవుతుందో అని వారు లిటిల్‌ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు, ఇక హైదరాబాద్‌ ఖాళీ అయిపోతుందని ఆంధ్రా మీడియా ప్రచారం చేస్తున్నప్పుడు, మున్సిపల్‌ మంత్రిగా వచ్చిన కేటీఆర్‌ వారికి పూర్తి కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. ఇండస్ట్రియలిస్టులకి.. అయామ్‌ విత్‌ యూ అన్న భరోసా కల్పించారు. సీఎం కుమారుడు, ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పోజర్‌ ఉన్న వ్యక్తి అండగా నిలవడంతో ఆయా వర్గాలు కుదుటపడడమే కాదు. భాగ్యనగరం ఒడిదుడుకులు లేకుండా తన జర్నీ సాగించింది. 

కేటీఆర్‌ టాస్క్‌ మేనేజర్‌. పెద్దగా హడావుడి, ఫాన్‌ఫేర్‌ లేకుండానే తనకు అప్పగించిన పనిని కూల్‌గా, పర్‌ఫెక్ట్‌గా, రిజల్ట్‌ ఓరియెంటెడ్‌గా పూర్తిచేస్తారు. టార్గెట్‌ రీచ్‌ అయ్యేదాకా పట్టువదలరు. పూర్తయ్యాక దాని గురించి పెద్దగా ఆలోచించరు. డూ ఇట్‌ అండ్‌ లీవ్‌  అన్నట్టుగా ఉంటుంది. నేటి కార్పొరేట్‌ యుగంలో కంపెనీలు అనుసరించే పద్ధతిదే. ఇప్పుడు టీమ్‌వర్కే కీలకం. మెనీ బ్రెయిన్స్‌ టుగెదర్‌ మేక్‌ క్యాపిటల్‌ అనేది ఇప్పటి  సిద్ధాంతం. కేటీఆర్‌  దీన్ని పూర్తిగా అనుసరిస్తారు. ఒక పనిలో  వ్యక్తిగతంగా తన క్రెడిట్‌కన్నా, తన మార్క్‌కన్నా,  ప్రభుత్వానికి, పార్టీకి, నాయకుడికి క్రెడిట్‌ రావడాన్నే ప్రిఫర్‌ చేస్తారు. కేటీఆర్‌ ఒకసారి తెలంగాణ మేధావుల సదస్సుకు వచ్చారు. అక్కడన్నీ ప్లాస్టిక్‌ కుర్చీలున్నాయి. ఆయన కోసం మాత్రం ఒక పెద్ద కుర్చీ తెప్పించి మధ్యలో వేశారు. ఆయన రాగానే చేసిన మొదటి పని, ఆ కుర్చీని తీసేసి, ప్లాస్టిక్‌ కుర్చీ వేసుకుని, అందరితో పాటు కూర్చుని మాట్లాడటం! భేషజాల రోజులు కావివి. హ్యూమ న్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్లు హ్యూమన్‌ రీజాయిస్‌ డిపార్ట్‌మెంట్లు మారిన కాలమిది. బాస్‌ కూడా కలీగ్స్‌ భుజం మీద చేయి వేసి, కలిసి క్యాంటీన్‌కు వెళ్లి టీ తాగుతూ, వారి కుర్చీ ముందు కూర్చుని కబుర్లు చెబుతూ, రిలయబుల్‌ టీమ్‌ మీద డిపెండ్‌ అవుతూ, పని చేసే కల్చర్‌కు ప్రతినిధి కేటీఆర్‌. 

అంతా తానై కాకుండా, మరొకరికి స్పేస్‌ ఇవ్వడానికే ఆయన ఇష్టపడతారు. సంప్రదాయ రాజకీయాలకు ఇది కొంచం కొత్తగానే కనిపిస్తుంది. కానీ మారుతున్న కాలంలో ఆర్గనైజేషన్లు ఎక్కువకాలం మనుగడ సాగించడానికి ఇది ఉపకరిస్తుంది.


కనిపించగానే ఒక జోక్‌ కట్‌ చేసి నవ్వుతూ పలకరించడం, ఎదుటి వ్యక్తి చేసిన పనిని ప్రశంసించడం, బోళాగా మాట్లాడడం, చిన్ననాటి రిలేషన్స్‌ని కొనసాగించడం, రిస్క్‌ తీసుకోగలగడం,  మూడు భాషల్లో ప్రావీణ్యం, ఎదురుదాడినైనా, ప్రజెంటేషన్‌నైనా ఒకే పదునుతో చేయగలగడం, వాగ్ధాటి, సింప్లిసిటీ, ఆత్మీయత, లీడర్‌షిప్‌ క్వాలిటీ.. కేటీఆర్‌కు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన లక్షణాలు. కేసీఆర్‌లాగే మంచి చదువరి. ఫ్యామిలీ మ్యాన్‌. ఇన్‌డెప్త్‌ నాలెజ్‌ ఉంటుంది. నచ్చకపోతే మొహంమీదే చెప్పేసే కేటీఆర్‌ దాన్ని అంతటితో  మరిచిపోతారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌కి తగ్గట్టుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌ చేయడం, ఐటీ సెక్టార్‌ని అన్నివైపులా విస్తరించడం, సిటిజెన్స్‌లో సివిక్‌ సెన్స్‌ను పెంచడం, బ్యూరోక్రటిక్‌ కరప్షన్‌ని ఆపేందుకు మున్సిపల్‌ యాక్ట్స్‌లో రిఫార్మ్స్‌ తేవడం, వరల్డ్‌వైడ్‌ ఉన్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ని ఇక్కడ అమలు చేయడం, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం,  అవసరమైన వారికి వెంటనే సహాయం అందించడం, క్రైసిస్‌ టైమ్స్‌లో టెక్నాలజీని వాడుకోవడం ఇవన్నీ కేటీఆర్‌ గురించి తెలిసిన విషయాలు. గుడ్డివాళ్లు రోడ్డు దాటేలా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సౌండ్‌ అలారమ్స్‌ బిగించడం, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు కట్టించడం, పరిశుభ్రత కోసం రోడ్డు పక్క కంటైనర్‌ టాయిలెట్స్‌ పెట్టడం, లాక్‌డౌన్‌ సమయంలో తన సోషల్‌ మీడియా అకౌంట్‌ని క్విక్‌ రెస్పాన్స్‌ ఫోరంగా మార్చడం ఆయనలోని మానవీయత. 

డే అండ్‌ నైట్‌ ట్రాఫిక్‌ ఉండే హైదరాబాద్‌లో పెండింగ్‌ ఫ్లై ఓవర్లు కట్టేందుకు, కొత్త రోడ్లు వేసేందుకు, రిపేర్లు చేసేందుకు లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం క్రైసిస్‌ని ఆపర్చునిటీగా మార్చుకునే క్రియేటివిటీ. 


రాజకీయాల్లోకి అనేకమంది మహామహులు వచ్చారు. కానీ జనాకర్షణ మాత్రం కొందరికే ఉంటుంది. ఈ కరిష్మా  కొందరికే ఎందుకు వస్తుందో రాజకీయ పండితులు కూడా చెప్పలేరు. తండ్రిలాగే కేటీఆర్‌ ఆ కరిష్మాను సాధించగలిగారు.  దేషంలో ఇప్పుడున్న యువ నాయకుల్లో, రాజకీయ వారసుల్లో కేటీఆర్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ అన్నది నిర్వివాదం. ఒక పెద్ద నాయకుడి నీడలో ఎదుగుతూ, సొంత గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. అందులో కేటీఆర్‌ సక్సెస్‌ అ య్యారు. కాలం మారుతున్నది. చదువుకున్నవారు, యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇట్లా ఇంకెంతకాలం? ఇది ఇలాగే ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న రేకెత్తుతున్నది. ఏదో ఒకటి సాధించాలనే తపన కనిపిస్తున్నది. తమ ఊరునో, నగరాన్నో బాగుచేసుకోవాలనే తాపత్రయం వ్యక్తమవుతూ ఉంది. 

గతానికి భిన్నంగా ఇది నగరాలు నాయకులను పుట్టిస్తున్న కాలం. కేజ్రీ, స్టాలిన్‌, సింధియా, పైల ట్‌.. అందుకు నిదర్శనం. నా అంచనా నిజమైతే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా రాజకీయాలు సమూలంగా మారిపోతాయి. ఇప్పుడు మనం అనుసరిస్తున్న రాజకీయ సంస్కృతి కొత్త అర్థం సంతరించుకుంటుంది.

ఒక చట్రంలోంచి చూసినప్పుడు కొంతే కనిపిస్తుంది. కానీ చట్రం అవతల కనిపించని మార్పు ఇంకొకటి జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పునకు ప్రతినిధే 44 ఏళ్ల  యువ కేటీఆర్‌. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు!

- శ్రీకర్‌


logo