బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Jul 19, 2020 , 00:05:46

ధర్మవాంఛ

ధర్మవాంఛ

సనసన చీల్చి యాదగిరిపైన నొకానొకమూల ఱాతి, ము

క్క నొకటి వీలుచేసుకొనికట్టిన సింగపుమోము ఱొమ్ము చీ

ల్చిన యొక గోరుగాదనువు చెందిన మూరితియైన నృసిం

హేపి మృధు భక్త్యాధీన హృదయున్‌ సదయున్‌ గనుగొంటినే సఖా!

దినదినముం జరించిన మదించిన ఏన్గులు సింహముల్‌ చరిం

చిన వనమందు నీ తనుపు చెందిన మూర్తిగాంచి భల్లి భి

ల్ల నికర మంతనంతన బలంబుగజేసిన పూవుటీరమం

దున వనచారిణి సమితి దూసిన పూవుల జాలు చూడుమీ.

కారణ మింతయుం దెలియగానిది చూడగనైనయట్టి యా

కారము చెప్పుకోనగుట కల్గిన రూపము రెంటికీ మూలమే సమా

చారమునేర్చు భక్త జనసంతతి కట్టిన దేవళంబులో

దీరికనున్న స్వామి గురుతించితె వేల్చులలోన మిత్రమా!

ఆస్తిలో నాస్తియున్నది ఆస్తికులని

యన్న యంతన నాస్తికులంచుగలరు,

యాదగిరిసామి యాస్తికులయిన వారి

యండ సేవించు మాస్తికుడయిన సఖుడ!

కక్షగ హిరణ్యకశిపుని లక్షణంబు

కలుగు చోట్లను గోళ్ల బెగల్చవలయు

సత్పదార్థంబు గాపాడ జను నృసింహ!

యీ వు దైవంబుగా నుండ నెంతువేని.

(1971లో నాటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావును అభినందిస్తూ... విశ్వనాథ సత్యనారాయణ రాసిన పద్యాలు)


logo