సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 19, 2020 , 00:05:46

విద్యాధనం ప్రధానం

విద్యాధనం ప్రధానం

నచోర హార్యం నచ రాజ హార్యం

న భ్రాతృ భాజ్యం నచ భారకారి

వ్యయే  కృతే వర్ఘత ఏవనిత్యం

విద్యా ధనం సర్వధన ప్రధానం

ధనం అంటే విలువైంది ఏదైనా! కొందరికి పశువుల సంపద, కొందరికి భూమి, మరికొందరికి బంగారం, ఇంకొందరికి డబ్బు... ధనం కావచ్చు. కానీ అన్ని ధనాల కన్నా విద్యాధనం అత్యంత శ్రేష్ఠం. ఎందుకంటే ఈ విద్యాధనాన్ని దొంగలు ఎత్తుకు వెళ్లలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు, ఎంత సంపాదించినా భారం కాదు. ఎంత ఖర్చుపెట్టినా... అంటే ఎంత చదివినా భారం కాదు. ఇంకా ఎంత ఖర్చుచేసినా (విద్యాదానం) ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకని విద్యాధనం సర్వ ధన ప్రధానం!



logo