శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 18, 2020 , 00:47:29

ఉపజ్ఞకు ఉపద

ఉపజ్ఞకు ఉపద

అది బోధి వృక్షం కాదు

అది వెర్రి మర్రి వృక్షం కాదు

తానూ పెరుగుతూ

తనను ఆశ్రయించిన వాటికీ

రసజ్ఞానాన్ని అందించి

ఊతమిచ్చిన చూత ఫలవృక్షం.

పుట్టిన నేల కోసం

తపన తాపత్రయం

తను మాటల్లో కాకుండా

చేతల్లో చూపిన ధీశాలి.

నేలను దొరల కబంధ చెర తప్పించి

భూ సంస్కరణ చట్టానికి చుట్టమయ్యాడు

మొక్కపెరిగి సంస్కరణ వృక్షమయ్యింది!

రాజులింట పుట్టకున్నా

దేశానికి రాజయ్యాడు

ఆర్థికపుష్టికి స్రష్టయ్యాడు

రచనకు అక్షర రంగులద్ది సాహితీ తోటలో

వాడని సుగంధ పారిజాతమయ్యాడు

తెలంగాణ మాగాణి మరువపు మొలక

చిరునవ్వు మోము.. వెన్నెల తునక..

మన మనిషి

జనం మనిషి

దేశం మెచ్చిన మహా మనీషి.logo