సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 16, 2020 , 23:48:13

ముఖ్యమంత్రికి ఒక లేఖ

ముఖ్యమంత్రికి ఒక లేఖ

సిరంజీలు, వాయిల్స్‌ సిద్ధం చేసుకుందాం
గౌరవ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావు గారికి,
విషయం: కరోనా నివారణ టీకా త్వరలో రాబోతున్న స్థితిలో అవసరమైన సిరంజీలు, మందుబుడ్డీలు తగినంతగా ఉత్పత్తి చేయటం గురించి..
ఆర్యా..
సమీప భవిష్యత్తులో కరోనా నివారణ టీకా రాబోతున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఆయా దేశాలన్నీ తమ ప్రజలకు టీకాలు ఇవ్వడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని ఆచరణాత్మక సమస్యలున్నాయని గమనించాలి.
అవసరమైన మేర టీకా మందును ఉత్పత్తి చేయాలంటే, అందుకు బయోరియాక్టర్ల వంటి పరికరాల తయారీకి పెట్టుబడులు కావాలి. దీనివల్ల తక్కువ వ్యవధిలో లక్షల కొద్ది డోసులు తయారు చేయవచ్చు. 
టీకా మందు ఉత్పత్తి అయిన వెంటనే పెద్ద సంఖ్యలో సిరంజీలు, మందుబుడ్డీలు అవసరమవుతాయి. కాబట్టి వాటిని పెద్ద ఎత్తున నిలువ పెట్టుకోవాలి.  
కరోనా టీకా మూలంగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనుక వస్తే, చికిత్స చేయడానికి మొబైల్‌ కిట్స్‌ సిద్ధం చేసుకోవాలి. 
ప్రపంచ వ్యాప్తంగా వీటికి పెద్ద డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల వీటిని అనుకున్న వెంటనే సమకూర్చుకోలేము. 
మీరు ఈ సూచనలను పరిశీలిస్తారని ఆశిస్తున్నా. 
మీ విశ్వాసపాత్రుడు


logo