మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 05, 2020 , 00:11:52

‘జలదంకి’ కథల పోటీకి ఎంట్రీల ఆహ్వానం

‘జలదంకి’ కథల పోటీకి ఎంట్రీల ఆహ్వానం

జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం - 2020 కథల పోటీ కోసం రచయితల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు నాటక, సినీ రచయిత జలదంకి సుధాకర్‌ తెలపారు. అర్ధాంగి త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా కథలు ఉండాలని, నిడివి అయిదు నుంచి ఏడు పేజీలకు మించవద్దని వెల్లడించారు. కథలను [email protected] మెయిల్‌కు, జులై 20వ తేదీలోగా పంపించాలి. మొదటి బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3 వేలు, తృతీయ బహుమతికి రూ. 2 వేలు, ముగ్గురికి ప్రోత్సాహక బహుమతి కింద రూ.వెయ్యి చొప్పున అందచేయనున్నట్టు తెలిపారు. కథా పురస్కారాలను ఆగస్టు 20న ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.


logo