మంగళవారం 11 ఆగస్టు 2020
Editorial - Jul 04, 2020 , 00:53:04

పీవీ-అయోధ్య

 పీవీ-అయోధ్య

  •  విగ్రహాన్ని తొలగించడమా!
    మూడో అధ్యాయం కొనసాగింపు...

మసీదులోకి వెళ్లాలంటే మందిర ప్రాంగణంలో నుండే వెళ్లాలి. అన్నివేళలా అది ప్రవేశయోగ్యంగానే ఉండేది. పైగా ఏ గంటలో చూచినా మందిర ప్రాంగణమంతా సందడిగానే ఉండేది. శుక్రవారం ప్రార్థనా సమయంలో తప్ప మిగితా సమయాల్లో మసీదు నిర్మానుష్యంగా ఉండేది. బలవంతంగానో, దొంగచాటుగానో మసీదులోకి ప్రవేశించాలనే దృఢ నిశ్చయంతో ఉండే హిందువుల్ని అడ్డుకోవాలంటే శాశ్వత ప్రాతిపదికపైన గట్టి బందోబస్తు ఏర్పాటుచేయాలి. నెలకు వేలాది రూపాయలు ప్రభుత్వం దానిమీద వెచ్చించాల్సి ఉంటుంది. గత ముప్పయ్యారేళ్లుగా ఈ వివాదంలో పలుమార్లు దాడులు జరిగినా, ఎంత ప్రాణ నష్టం వాటిల్లినా శాశ్వత ప్రాతిపదికన మసీదు వద్ద బందోబస్తు ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కన్పించదు. ఒక వేళ శాశ్వత ప్రాతిపదికన పోలీసు బందోబస్తే దీనికి తగిన తరుణోపాయం అని తలచిన పక్షంలో ప్రభుత్వం శతాబ్దాల కాలంగా వివాదంలో చిక్కుకున్న ఇదే గాక రాష్ట్రంలోని ఇతర దేవళాల వద్ద కూడా శాశ్వత ప్రాతిపదికన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి ఉండేది. అటువంటి ఏర్పాటులేని కారణం చేత, అటువంటి దుండగపు చర్య జరగబోతుందనే సమాచారం ఏ వైపు నుండి లభించని కారణం చేత నిర్మానుష్యంగా, దాదాపు నిరుపయోగంగా పడివున్న మసీదు వద్ద పన్ను కట్టే ప్రజలపై భారం పడే విధంగా ఖర్చుతో కూడుకున్న శాశ్వత ప్రాతిపదికపై పోలీసు బలగాల్ని కాపలా వుంచే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి సమర్పించియుండలేదు.

నేను సాదరపూర్వకంగా ప్రభుత్వాన్నుండి తెలుసుకొనగోరేదేమంటే ప్రభుత్వానికి ఈ వివాదాస్పద స్థలంలోనూ, వివాదంలో వున్న బెనారస్‌, మధురవంటి తావుల్లో ఇటువంటి దుండగపు చర్యల్ని అరికట్టేందుకు శాశ్వత ప్రాతిపదికన పోలీసు కాపలా ఏర్పాటు ఆలోచనలేమయినా ఉన్నాయా అని, ఒకవేళ ప్రభుత్వం అటువంటి నిర్ణయానికి రాలేకపోతే ఇటువంటి అనుకోని, అనుమానానికి తావివ్వని ఘటనలు సంభవించినప్పుడు మున్ముందు జిల్లా అధికార యంత్రాంగంపైనే బాధ్యత అంతా ఉంటుందని భావించవలసి ఉంటుందా?

విగ్రహం ఇంకా ఎందుకు తొలిగించబడలేదు? 23 ఉదయాన్నే దానిని ఎందుకు తొలగించలేదు అనేవి అడిగేందుకు తేలికయిన ప్రశ్నలే. ఉన్న పోలీసు బలగంతో విగ్రహాన్ని బలప్రయోగంతో తొలగించటం సాధ్యమే. ప్రతి ఘటన స్వల్పంగా ఉండే రాత్రివేళల్లో రహస్యంగా తొలగించటమూ సాధ్యమే. ప్రతి ఘటన స్వల్పంగా ఉండే రాత్రివేళల్లో రహస్యంగా తొలగించటమూ సాధ్యమే. అయితే ఎదుర్కొనవలసిన పరిణామాలతో ప్రమేయం లేకుండా విగ్రహాన్ని తొల గించటమనేది నా దృష్టిలో అధికార దివాళాకోరుతనానికో, నియంతృత్వానికో చెందిన చర్య అవుతుంది. 23న మాకున్న కొద్దిపాటి వనరులతో వీలుపడదుగాని ఇప్పుడయితే ప్రజల ప్రశాంతతపై స్వల్కాలిక ప్రతిచర్యల్ని అందుబాటులో ఉన్న బలగాలతో అడ్డుకోగలం. 

(‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి..)logo