గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jun 28, 2020 , 00:06:36

సుశ్లోకం

సుశ్లోకం

పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ వహంతి నద్యః

పరోపకారాయ దుహంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం

ఈ శరీరాన్ని పరోపకారం కోసం వినియోగించాలి. ఈ పాంచభౌతికమైన ప్రకృతిలో పరోపకారం కోసమే వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి. అదే విధంగా నదులు వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ప్రాణుల అవసరాలను తీర్చడం కోసమే ప్రవహిస్తున్నాయి. పరోపకారం కోసమే ఆవులు పాలను ఇస్తున్నాయి. మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి తన శరీరం ద్వారా పరోపకార స్వభావాన్ని అలవర్చుకుంటే సమాజం సుఖశాంతులతో ఉంటుంది.


logo