శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jun 20, 2020 , 23:40:45

జీవన సంగీతం

జీవన  సంగీతం

జీవితం

ఓ స్వర సంగమం.

సప్త స్వర లయ గమనం 

బతుకు తెరువుల పయనం.

రాగ మూర్చనలు  

జీవిత సత్యాలు. 


జీవితం

ఓ స్వర సంగమం. 

సరళీ స్వరాలు 

పిల్లల తొలి అడుగులు. 

గీతాది కృతుల వర్ణనలు 

వూహకందని మలి అడుగులు.

స్వర గమకాలు 

ఆలుమగల ప్రేమానుబంధాలు.

మనోధర్మ సంగతులు 

జీవితానికి ముందడుగులు.

 

జీవితం

ఓ స్వర సంగమం.

స్వర అంతరాలు 

జీవన ధర్మాలు.

అన్యస్వర ఆలంబనలు    

బంశమిత్రుల ఆగమనాలు.

రంజక ప్రయోగాలు 

వినోద భరితాలు.

షడ్జ పంచమాలు 

దృఢ సంకల్పాలు.

రిషభాది నిషాదాలు 

ఆశలకు రహదారులు.

త్రి స్థాయి ఆలాపనలు 

విజయానికి సంకేతాలు.

జీవితం

ఓ స్వర సంగమం. 

స్వర కల్పనలు 

సృజనకు ఆనవాళ్లు.

దాటు స్వరాలు 

ప్రగతికి సోపానాలు.

స్ఫురిత స్వరాలు 

చిలిపి చేష్టలకు సంకేతాలు.

స్వర కంపితాలు 

మనోభావాలకు నిదర్శనాలు.

 

జీవితం

ఓ స్వర సంగమం.

స్వర సంకీర్తనలు 

ఆధ్యాత్మిక బోధనలు.

రాగ జావళీలు 

రసిక హృదయ భావనలు.

వాగ్గేయకారుల రచనలు 

జీవిత పరమార్థాలు.

లక్షణ కారుల సూక్తులు 

మన జీవన సూత్రాలు.


జీవితం

ఓ స్వర సంగమం....

నేడు ప్రపంచ 

సంగీత దినోత్సవం

- డా. తుమ్మల శ్రీనివాసులు

9704129872
logo