ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 00:03:06

కవితా పురస్కారానికి ఆహ్వానం

కవితా పురస్కారానికి ఆహ్వానం

సాహితీ గౌతమి, కరీంనగర్‌ సంస్థ పక్షాన గత ముప్పై ఏండ్లుగా ప్రతిష్ఠాత్మకంగా సినారె కవితా పురస్కారం అందచేస్తున్నది. 2020 సంవత్సరానికి గాను ఈ పురస్కారం కొరకు కవితా సంకలనాలను తెలుగు ఉభయ రాష్ర్టాల నుంచి ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 2018, 19, 20 సంవత్సరాలలో ముద్రించిన వచన కవితా సంకలనాలను నాలుగు ప్రతుల చొప్పున పంపగలరు. గతంలో పురస్కారం పొందిన కవులకు అవకాశం లేదు. పద్య, గేయ, కావ్యాలు, నానీలు మినీకవితలు పంపరాదని మనవి. వచనకవితా సంపుటాలను జూలై 10లోగా ఈ చిరునామాకు పంపగలరు. వివరాలకు 9848255525 నంబరును సంప్రదించగలరు. 

చిరునామా: డా.ఎడవల్లి విజయేంద్రరెడ్డి,

శివానంద ఆసుపత్రి, 3-3-181,

సవారన్‌ స్ట్రీట్‌, కరీంనగర్‌.


logo