శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 00:03:05

భాష వయసు రెండున్నర కోట్లు

భాష వయసు రెండున్నర కోట్లు

సమస్యే లేదు.... భాష లేకపోతే నాగరికత ఇంతలా విస్తరించేదే కాదు. కానీ ఆ భాష మొదలై ఎన్నాళ్లయి ఉంటుంది? ఇంగ్లండ్‌లోని ‘న్యూకేజిల్‌ విశ్వవిద్యాలయం’వారు భాష ఏకంగా రెండున్నర కోట్ల ఏళ్లకు ముందే ఏర్పడిందని కనుగొన్నారు. మనిషినీ... అతనికి దగ్గరగా ఉండే వానర జాతులనీ పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. దీంతో భాష విలువ ఎంతో తెలుస్తున్నది... పిల్లలలో భాషాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.logo