ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 10, 2020 , 00:18:34

రైతు వెతల కథలు ఉండవిక

రైతు వెతల కథలు ఉండవిక

రైతుకు అండగా ప్రతి ఊరు నుంచి రాష్ట్రస్థాయి వరకు అనేక రకాలుగా రైతులకు భరోసా ఇస్తున్నారు. ఆరేండ్లుగా రైతు చుట్టే తిరుగుతున్నవి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు. రైతుకు అండగా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణాధికారి నుంచి రైతుబంధు, రైతు సమితులు, వ్యవసాయాధికారులు, జిల్లా కలెక్టర్లు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు పనిచేస్తున్నారు.

‘బొంబాయి దుబాయి బొగ్గుబాయి’.. తెలం గాణలో బతుకు తెరువులేక పొట్టచేత పట్టుకొని వలస వెళ్తున్నవారి జీవన స్థితిగతులను వివరిస్తూ కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలు ఉపన్యా సాల్లో చెప్పిన మాట ఇది. మన దేశమే వ్యవసాయ ఆధారితమైనది. వ్యవసాయం ప్రధానమైన తెలంగాణలో వలసలు లేని జిల్లాలు ఉండవు. కారణం వ్యవసాయం దండుగ అనే ప్రభుత్వం ఉన్న స్థితిలో, వ్యవసాయం చేసి తమ బతుకులు బాగుచేసుకుందామనే వారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టే తెలంగాణలో 2014కు ముందు వ్యవసాయాన్ని పడావు పెట్టి బతకడానికి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షల కుటుంబాల వెతలను కతల్లాగా చెప్పుకోవాల్సిందే. 

వలసలు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది పాత పాలమూరు జిల్లా. బహుశా అతి ఎక్కువ వలసలున్న జిల్లా అది.  పాలమూరు అనగానే ఒక అనుభవం గుర్తుకు వస్తుంది. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా తెలంగాణకు జరుగు తున్న మోసాలను ప్రపంచానికి తెలిసే విధంగా పోరాట రూపాలను ఎంచుకునేవారు. దాంట్లో భాగంగా 2002లో ఆలంపూర్‌ నుంచి గద్వాల వరకు 170 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న నేను కూడా వారితోపాటు ఉన్న. రెండవ రోజు పాద యాత్ర చేస్తున్న సందర్భంలో ఎర్రటి ఎండలో రోడ్డు పక్కనే ఆముదంచేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు కూలీలు కనిపించారు. అక్కడ మా బృందం ఆగింది. వారితో కేసీఆర్‌ మాట్లాడటం మొదలుపెట్టారు. ‘మీరు చేస్తున్న పనికి కూలి ఎంత వస్తుంది?’ అని అడిగినప్పుడు ‘15 రూపాయలు’ అన్నారు. వారితో కేసీఆర్‌ ‘15 రూపాయలతో ఎట్లా బతుకుతారు.. కూలి పెంచుమని రైతులను ఎప్పుడు అడగ లేదా?’ అని ప్రశ్నించారు. అందుకు.. ‘లాభాలురాని వ్యవసా యం బంద్‌ చేసుకుంటారు కానీ కూలి పెరుగదు’ అని వారు చెప్పిన మాట ఇంకా గుర్తుంది. ప్రపంచంలో అంతటా రైతు కూలీ పోరాటాలు జరిగాయి. కానీ పాలమూరులో కూలీలే రైతులపైన సానుభూతి చూపించే పరిస్థితులుండేవి. అప్పటి తెలంగాణ పరిస్థితులకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఆ ఘ టనను ఇప్పటికీ మర్చిపోలేను. అటువంటివి ఉద్యమ కాలం లో కేసీఆర్‌ అనేకం చూశారు కాబట్టే, ఇవ్వాళ వ్యవసాయం కేంద్రంగా అనేక కార్య క్రమాలను చేపడు తున్నది ప్రభుత్వం. 

వ్యవసాయం అంటే ఒకప్పుడు భారమైన ముచ్చట. వ్యవసాయం చేసే రైతు ఒంటరి. పడుతదో లేదో తెలియని బోరు నుంచి మొదలుకొని, కరెంటు తెచ్చుకొని కుటుంబం అంతా ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత, ఆశతో మార్కెట్‌కు వెళ్లి చాలీచాలని మార్కెట్‌ ధరలతో అమ్మలేక బోరునఏడ్చిన రైతులను చూసినం. ఇంకా నష్టాలొస్తే తెచ్చుకున్న పురుగులమందే పెరుగన్నం లాగా తిని ప్రాణాలు తీసుకున్న రైతుల ఆత్మ హత్యలు చూసినం. రోడ్డున పడ్డ రైతు కుటుంబాలను చూసినం. కానీ ఆదరించిన ప్రభుత్వాలు లేవు. ఆదుకున్న ఆపద్బాంధవుడు లేడు. 

యాసంగిలో ఏ పంటలు వేస్తే లాభసాటో, అధిక దిగుబడి వస్తుందో, వర్షాకాలంలో ఏ పంటలు రైతును ఆర్థికంగా నిలబెడుతాయో ఆ ప్రాధాన్య పంటలను సూచిస్తున్నది. అందుకే ఇవ్వాళ రైతుకు శషభిషలు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆదర్శవంతమైన వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణను ఒక అద్భుతమైన, మొదటి వరుసలో నిలబెట్టే ప్రయత్నం కొనసాగుతున్నది. 

మరి ఇప్పుడు.. రైతుకు అండగా ప్రతి ఊరు నుంచి రాష్ట్రస్థాయి వరకు అనేక రకాలుగా రైతులకు భరోసా ఇస్తున్నారు. ఆరేండ్లుగా రైతు చుట్టే తిరుగుతున్నవి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు. రైతుకు అండగా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి రైతుబంధు సమితులు, వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు పనిచేస్తున్నారు. ఒంటరి అనుకున్న రైతుకు ఇవాళ ఆకాశమంత బలగం అండగా నిలుస్తున్నది. రైతుల్కు సాగునీరు, నకిలీ విత్తనాల, మందుల బెడద లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. అప్పుల బాధ లేకుండా పెట్టుబడికి రైతుబంధు, విత్తనం వేసిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు, పంట చేతికి రాగానే రైతుబంధు సమితుల ద్వారా దిగుబడి అమ్మకం, మినిమం మార్కెట్‌ రేటు కోసం పర్యవేక్షణ, లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయటం ద్వారా ప్రస్తుతం రైతుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. 

 సకలం సమకూరుస్తూ రైతు అభివృద్ధే లక్ష్యంగా, రైతే కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇవ్వాళ మన ముందు కొన్ని అంశాలను ప్రతిపాదిస్తున్నది. రైతుకు ఇవ్వాళ ఏ పంట లాభదాయకమో దేనికి ప్రాధాన్యమివ్వాలో గుర్తుచేస్తున్నది. ఏ పంట ఏ నేలపై సరియైన దిగుబడి వస్తుందో పరిశోధన చేసి చెప్తున్నది. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుందో సలహా ఇస్తున్నది. రైతును గట్టెక్కించటం కోసం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన వ్యవసాయదారుడిని చేయటం కోసం గింజ విత్తి పంట చేతికొచ్చి మార్కెట్‌లో లాభసాటిగా అమ్ముకునే వరకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

యాసంగిలో ఏ పంటలు వేస్తే లాభసాటో, అధిక దిగుబడి వస్తుందో, వర్షాకాలంలో ఏ పంటలు రైతును ఆర్థి కంగా నిలబెడుతాయో ఆ ప్రాధాన్య పంటలను సూచిస్తు న్నది. అందుకే ఇవ్వాళ రైతుకు శషభిషలు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆదర్శవంత మైన వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణను ఒక అద్భుత మైన, మొదటి వరుసలో నిలబెట్టే ప్రయత్నం కొనసాగు తున్నది. ఈ యత్నానికి రైతుల సహకారం ఉండాలి. దేశమే విస్తుపోయే మరొక నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అన్న సంగతి తెలిసిందే. అమాయకంగా రైతుపై సానుభూతి తెలిపే పాలమూరు రైతుకూలీల నుంచి, అంతే అమాయకత్వంతో ‘వ్యవసాయం బాగుపడాలంటే తెలం గాణ కావాలనే ఫనికర మల్లయ్య’లు ఉన్న తెలంగాణ రైతు కోరుకునేది లాభసాటి వ్యవసాయమే. 

(వ్యాసకర్త: ప్రభుత్వ విప్‌, శాసనమండలి సభ్యుడు)
logo