గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jun 05, 2020 , 23:04:30

సారంటేనే బరోసా

సారంటేనే బరోసా

నాకు సెంటు భూమి లేకున్నా ఎవుసంతోని, ఎవుసాయం జేసే రైతులతోటి ఏండ్ల నాటి బంధం నాది. ఎందుకంటే ఎవుసందారుల కరెంటు మోటర్లు కాలిపోతే రిపేర్‌ చేసే మెకానిక్‌ను నేను. నాకు ఇరువై ఏండ్లున్నప్పటి సంది ఇదే పన్జేస్తున్న. ఇప్పుడు నా వయస్సు 58 ఏండ్లు. ఇట్లా ఇప్పటిదాంకా రైతుల మజ్జ, బాయిల పొంటే గడిసింది నా జీవితం. 

ఇగ నీళ్ల ముచ్చటకు అస్తే నాకు ఇంచుమందం భూమి లేకున్నా ఈ కాల్వల పొంటి నిండుగ పారే నీళ్లను సూత్తె తెగ సంబురమైతున్నది. గతంల మాకు ఆర బందు లెక్కన నీళ్లచ్చేవి. అదీ ఒక్క పెద్ద కాల్వలనే. గత నాలుగు నెల్ల (జనవరి) సంది సూత్తున్న, ఒక్కరోజు కూడా కాల్వ ఖాళీగా కనవల్లే. 

ఒకప్పుడు రాత్రిపూట నాలుగు గంటలు, పగటిపూట మూడు గంటల కరెంటు అచ్చేది, అది కూడా టు పేస్‌. కరెంటు మోటర్లు, ట్రాన్స్‌ఫర్లు ఊకూకే కాలిపోయేటియి. అవి మంచిగయ్యేసరికి మూడ్నాలుగురోజులు పట్టేది. కరెంటు సార్ల సుట్టూ రైతులు తిరిగీ తిరిగీ కాళ్ల చెప్పులరిగేటియి గనీ కరెంటోళ్లు మాత్రం జల్ది రాకపొయ్యేది. వరి సేన్లు పొట్టకచ్చేసరికి బాయి మోటర్లు ఖరాబైతే పొలం ఎండిపోదా? ఎవ్వలింటికి వొయ్యినా ఇదే బాధ. ఏ రైతింటికి వొయ్యినా ‘ఈ కరెంటోని తలపండు వల్గ ఇగరాడు అగరాడనుకుంటా రైతులు బాధవడేది. తెలంగానచ్చినంక అసొంటి పరిస్థితి లేదు. 24 గంటలు కరంటత్తుంది. బాయి మోటర్లు ఖరాబవుడు లేదు, ట్రాన్స్‌ఫర్లు ఖరాబవుడు లేదు.

నాకు గిరాకీ తగ్గింది కావచ్చు, రైతులతోటి ఉన్న బంధం మాత్రం పోలే. ఇప్పటికీ ఎవుసందారుల ఇండ్లళ్లకు వొయ్యి ముచ్చటవెడ్తునే ఉంటా. సడుగుపొంటి, బజార్లపొంటి ఎవుసందారులు కనవడ్తే మందలించుకుంటం. రైతుబంధు గురించి, రైతు బీమా గురించి గొప్పగా చెప్తరు. గతంల పెట్టువడి లేక అప్పోసప్పో జేసి ఎవుసం జేసేది రైతులు. ఇప్పుడు రైతులకు కేసీఆర్‌ సార్‌ ఇచ్చే రైతుబంధు పది వేలు అకౌంట్ల వడ్తున్నయ్‌. రెండుపసళ్లకు కలిపి ఈ పది వేలకు ఇద్దరాలుమొగల కట్టం తోడైతే పెట్టువడి ఎల్లిపోతున్నదంటూ సంబురపడుతున్నరు రైతులు. ఇదిట్ల ఉంటే మొన్నటికి మొన్న మా ఊళ్లే ఇద్దరు, ముగ్గురు రైతులు సచ్చిపోయిర్రు. ఐదు లచ్చల రైతుబీమా పైసలచ్చినయ్‌. ఆ పైసల్‌ కుటుంబాలకు ఎంతాసరైనయో వాళ్లకే తెలుసు. నిజంగా తెలంగానచ్చినంక ఇంత మంచి మంచి నిర్ణయాలుంటయనుకోలె.

కరంటు, రైతుబీమా, రైతుబంధే కాదు. మన తెలంగాన అన్నింట్లా ముందున్నదని పేపర్లకత్తంది, టీవీలళ్ల సూపెడుతున్నరు. మోయేడు, నిరుడు మా వాడకట్ల మూడు పెండ్లిళ్లయినయి. ఒక్కలికైతే తిరుగువారమెళ్లకముందే కల్యానలచ్మి చెక్కచ్చింది. కడ్మిద్దరికి కొంచెం ఆల్షమైనా రెండు నెళ్లల్ల కల్యానలచ్మి చెక్కులచ్చినయ్‌. గతంల ఆడివిల్ల పెళ్లి చేసుడంటనే తల్లిదండ్రికి పెద్ద గోస. ఆ అరిగోస భారాన్ని తగ్గించిండు కేసీఆర్‌ సార్‌. కల్యానలచ్మి పేర లచ్చ రూపాల సిల్లరిస్తుండు. ఇదెంత పెద్ద బరోసో ఎరుకేనా, ఈ పైసలను పెండ్లిపిల్ల, పిల్లగాడు మేనమామ పెట్టిన కట్నం కింద లెక్కగడుతున్నరు. ఇట్లా రాష్టంల ఉన్న ప్రతి ఆడివిల్ల బరువును కేసీఆర్‌ సారే బాధ్యతగా ఎత్తుకోవడం ఆయనది ఎంత పెద్ద గుండెనో ఎరుకజేస్తున్నది.

ఇగ మొన్న మోటర్‌ ఖరాబైందని ఎవుసందారు పోన్జేత్తె సడుగు పొంటి పోతున్న. ఓ అవ్వ కట్టె వట్టుకొని రోడ్డుపొంటి పోతున్నది. ‘ఓ అవ్వ ఎటువోతున్నవ్‌?’ అన్న. ‘కేసీఆర్‌ ఇచ్చే పింఛన్‌ పైసల కోసం వోతున్న బిడ్డా’ అన్నది. ‘నీకు కొడుకుల్లేకున్నా కేసీఆరే పెద్ద కొడుకైండుగా’ అన్న. ‘ఔ లేకపోతే’ అంటూ పళ్లిగిలిచ్చింది. ఇట్లా ఎందరో ముసలోళ్లకు పెద్దకొడుకైతున్నడు కేసీఆర్‌ సార్‌. కొంతమంది ముసలోళ్లకు కొడుకులున్నా పట్టించుకోక సడుగు మీద పడుతున్నరు. అసొంటోళ్లందరికీ కేసీఆర్‌ ఇచ్చే రెండు వేల రూపాలు ఆసరా ఐతున్నయ్‌.

ఇగ నీళ్ల ముచ్చటకు అస్తే నాకు ఇంచుమందం భూమి లేకున్నా ఈ కాల్వల పొంటి నిండుగ పారే నీళ్లను సూత్తె తెగ సంబురమైతున్నది. గతంల మాకు ఆర బందు లెక్కన నీళ్లచ్చేవి. అదీ ఒక్క పెద్ద కాల్వలనే. గత నాలుగు నెల్ల (జనవరి) సంది సూత్తున్న, ఒక్కరోజు కూడా కాల్వ ఖాళీగా కనవల్లే. ఎండకాలంల గూడ కాల్వల పొంటి నిండుగ నీళ్లస్తున్నయంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మహిమే. ఎక్కడో అడుగునున్న నీళ్లను కొండలమీదికి ఎత్తిపోస్తండు కేసీఆర్‌ సార్‌ అని మొన్న పేపర్లచ్చింది. వార్తలల్ల గూడ చెప్పిర్రు.

మొన్న వ్యవసాయాధికారులు మా ఊరికచ్చిండ్రట. ‘ఈ వానకాలం పంటల కింద పత్తులు, కందులు, వరిలో సన్నటి రకాలు మాత్రమే పండియ్యాలె, అట్లయితనే రైతుబంధు ఇస్తం, లేకుంటియ్యం, ఇది మా మాట కాదు, కేసీఆర్‌ సార్‌ చెప్పిన మాట’ అని రైతులకు సెప్పిండ్రట. అంతే మా ఊరి రైతులంతా గుమిగూడి ముచ్చట వెట్టుకుంటున్నరు. ‘కేసీఆర్‌ సార్‌ ఏది చెప్తే అదే పండిద్దాం, సారును చిన్నతనం సూత్తే మనకన్యాయమే జరుగుద్ది తప్తే ఏముండది’ అనుకుంటా వానకాలం భూములను దున్నేటందుకు నాగలి కడుతున్నరు రైతులు. కేసీఆర్‌ సార్‌ మాటంటే మాట. ఆయనేం మాట్లాడితే అదే చెల్లుతది. సారు మాటకు ఇంతిలువిస్తుండ్రంటే సారు మీద రైతులకెంత నమ్మకం. ఇంకా పదేండ్లయినా సారు దిగిపోవద్దు, అప్పుడే మా అసొంటి పేదోళ్లకు న్యాయం జరుగుద్దని ముచ్చటవెట్టుకుంటుంటే నాకు తెగ సంబురమైంది.

పేరు ప్రచురించడానికి ఇష్టపడని ‘వరంగల్‌ అర్బన్‌' జిల్లాకు చెందిన ఓ మోటర్‌ మెకానిక్‌ మనోగతం ఇది...


logo