గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jun 05, 2020 , 00:05:48

చెట్టును చూసి నేర్చుకుందాం

చెట్టును చూసి నేర్చుకుందాం

మోడు లాగా కాదు

చెట్టు లాగా బతుకుదాం

పచ్చగా ఉందాం

నీరు నీరవుతున్న విశ్వాసానికి

మంచినీటిని అందిద్దాం

మనలోని ఆలోచనల విత్తనాలకు

ఆశయాన్ని ఎరువుగా వేద్దాం.


మొక్కగా ఎదుగుదాం

తీయని పండ్లరసాల్లాగా

మనం ప్రేమను పంచుదాం..


అందమైన పూలరంగులతో

నిర్మలంగా నవ్వుదాం

శాఖోపశాఖలుగా ప్రతిభను

సరిహద్దులు దాటిద్దాం..


వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టుకుందాం

మహావృక్షమై నిలబడుదాం

నీడనిద్దాం.. గూడునిద్దాం..

సూర్యరశ్మితో వెచ్చగా వెలుగుదాం.


అన్ని కాలాలకు తట్టుకొని

ఆత్మవిశ్వాసంతో నిలబడుదాం

శిశిరంలో ఓటమి ఎదురై రాలిపోయినా

వసంతంలో చిగుళ్ళెత్తి విజయం సాధిద్దాం

చెట్టులాగ ప్రపంచానికి అమ్మతనం చాటుదాం

పచ్చదనం నిలుపుదాం

ప్రగతి విలువ తెలుపుదాం...


logo