సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jun 03, 2020 , 23:13:52

తెలంగాణమిప్పుడు..

తెలంగాణమిప్పుడు..

ఇప్పుడు తెలంగాణ

దేశానికే అన్నపూర్ణయింది

ఆపతికి, సంపతికి

నిలబడే పెద్ద దిక్కయ్యింది


స్వయం పాలనలో ఏళ్లనాటి వివక్షను

ఊది పారేసింది

నీరమో.. నీరమో..

అని కుమిలిన తెలంగాణ మొర విన్న ఒక సంకల్పం

కార్యదీక్షకు మారుపేరైంది 


ఆ భగీరథుని ఎన్క ఉరికిన గంగోలే

దక్షిణ గంగవ్వ

నేడు తెలంగాణకే కంఠహారమైంది! 


గునుక పూలవానై

బీడు భూములు మురుస్తున్నవి

కట్లపూల దారై

బంజరు భూములు మెరుస్తున్నవి

బీరపూల జలపాతమై

ఈ నేల ఉరికురికి దుంకుతున్నది

తంగేడుపూల వాగులై

తెలంగాణనే తడుపుతున్నవి!


తెలంగాణలో ఇయ్యాళ

నీళ్లు కొండలెగబాకుతున్నవి

ఎడారి గొంతులో పాలధారలౌతున్నవి

కాళేశ్వరమిప్పుడు తీయని బతుకమ్మ పాట

తెలంగాణమిప్పుడు బతుకుచూపే బాట


logo