సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - May 30, 2020 , 22:41:21

నిజం తెలుసు

నిజం తెలుసు

నీళ్ళకు 

నీటికి

పల్లెమే కాదు

నిజమూ తెలుసు!

గోదావరి ఎదురెక్కి

ఇప్పుడు

తెలంగాణ దారిలోకొచ్చింది!

పొంగడం

పొర్లడమే కాదు

మహా నాగరికతలు

నిర్మించిన నదులకు

నవ్వడమూ తెలుసు

నవ్వించడమూ వచ్చు!

చుక్క చుక్క

ఒడిసి పట్టుకుని

లెక్కగట్టుకున్న నేల మీద

నడిచే నదుల జాతర

నీళ్ళకు నిజం తెలిసింది..!

ప్రకృతికి మనిషి

కొత్త ఆకృతినిస్తున్నాడు

రేపటి చరిత్రకు

నీటి శాసనాలు రాస్తున్నాడు

ఇక గొంతెత్తి పాడుకుందాం..

‘జయజయహే.. తెలంగాణ...’


logo