శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - May 28, 2020 , 23:15:23

అతడు శాశ్వతుడు

అతడు శాశ్వతుడు

అతడు సింహం వంటి నదిని తల నిమిరి, 

జూలు దువ్వి ప్రేమతో శాసిస్తాడు .. 

అప్పుడు ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ 

నదీ ప్రవాహం

ఆరొందల మీటర్లెత్తున్న కొండలకు ఎదురెక్కి

ప్రచండ భీకర గర్జనలతో సింధువై విస్తరిస్తుంది 

అతని ఆత్మంతా

ఒక మహా సముద్రమై పల్లవిస్తున్నపుడు

ఉపనదులు, వాగులు, వరదలు

ఉప్పెనలు, తుఫాన్లు.. అన్నీ

వెంట పక్షుల్లా నడచివస్తాయి వినమ్రంగా..

అతని విస్తృతంతా పదడుగులే 

లక్ష్మీ బరాజ్‌ నుంచి ఆఖరి అడుగులో

కొండపోచమ్మ పాదాలను గోదావరి  స్పర్శిస్తూంటే..

ఎవరు తల్లి.. ఎవరు బిడ్డ..

ఆకాశం భూమిని ముద్దాడుతుంది..

జల సౌందర్యంతో

కోటి ఎకరాల జలపునీత మహాయజ్ఞంలో 

అతను యుగయుగాలుగా తపస్సిస్తున్నాడు 

తెలంగాణాను ఈ దేశాన్నే పోషించగల

‘అక్షయ పాత్ర’గా సృష్టించి ఇచ్చి

ఒక్కడే.. మనిషి శాశ్వతుడైపోతున్నాడు

చరిత్రలో ఒక ఆకాశంలా..

ఒక సూర్యునిలా...


logo