శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 23, 2020 , 22:29:08

కోనేరులో

కోనేరులో

తానమాడినట్లే..

బతుకుపోరులో గెలుపుకోసం 

కన్నవారిని, కన్న ఊరిని వదిలి

సుదీర తీరాలకు బయలుదేరితినా

ఎక్కడో దక్షిణదేశం 

అక్కడే రెక్కల కష్టం

బండలు పిండి చేసైనా

మట్టిని ఇటుక చేసైనా

ఊళ్లకు దారులు వేసైనా 

ఇరువైపులా చెట్లు నాటైనా

నూతన నిర్మాణాలతో

నగరాలు నిర్మించైనా

రక్తాన్ని చెమట చేసైనా

చెమటతో చలువను పంచైనా

బతుకు పోరులో గెలువాల్సిందే..

నాలుగు రాళ్లతో

తిరిగి రావాల్సిందే

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 

మొదలౌతుందంటే

ఎంత కడుపు నిండినట్లో

అన్నారం, పోలవరం అంటే

నిజంగా ఆ దేవుని వరాలే

మల్లన్న సాగరమంటే 

కోనేరులో తానమాడినట్లే

కాలువలు తోడుడంటే ఉబికివచ్చే

కన్నీళ్లకు అడ్డుకట్ట వడ్డట్లే

పంటకోతలు 

మొదలయితున్నయంటే

బతుకు వంట పండినట్లే

యాదాద్రి పునఃనిర్మాణమంటే

దేవుని దర్శనమైనట్లే

చేతినిండా పనులుంటే 

బతుకుపోరు సవ్యంగా సాగినట్లే

నాలుగు రాళ్ళతో భద్రంగా తిరిగి 

వస్తాలే అని వర్తమానం పంపినట్లే


logo