గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - May 19, 2020 , 23:29:41

వెలుగని ఉ‘ద్దీపం’

వెలుగని ఉ‘ద్దీపం’

ఎంఎస్‌ఎంఈల స్వరూపాన్ని మార్చి 100 కోట్ల టర్నోవర్‌కు పెంచడం మంచి పరిణామమే. ఉద్దేశం మంచిదే అయినా అమలు విధానం ఎలా అనేది అందరి నోట్లో నానుతున్న ప్రశ్న. ఎస్‌ఎంఎస్‌ఈ లోన్‌ ఇస్తూ 12 నెలల మారిటోరియం కేంద్రం ప్రకటించడం, మళ్లీ అందులో అసలుకు వడ్డీ వసూలు చేయడం అంటే ఆ సంస్థలకు వ్యయభారమే. దీనికి బ్యాంకు మేనేజర్లు ఎంతవరకు రిస్కు తీసుకొని రుణం ఇస్తారనేది ప్రధాన ప్రశ్న.

యాభై లక్షల వీధి వ్యాపారులకు 5వేల కోట్లను కేటాయించడం, తక్కువ ఆదాయం గల మూడు కోట్ల కుటుంబాలకు నాబార్డు ద్వారా 30వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టబడి అందించడం మంచి పరిణామం. కేవలం ఆకర్షణీయమైన లక్ష్యాలను ప్రకటించడంతోనే సరిపోదు. 

‘స్వాన్‌' అనే స్వచ్ఛందసంస్థ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగులు మే 3వ తేదీ నాటికి  27.1 శాతంగా నమోదు కావడం దేశచరిత్రలో మొదటిసారి. ఇది ఆందోళన కలిగించే అంశం. లాక్‌డౌన్‌ కారణంగా 89 శాతం వలస కార్మికులు దాతలు అందించిన ఆహారంతో జీవనం కొనసాగించడం బాధాకర పరిస్థితి. కాగా, గత కొంతకాలంగా కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ షేర్ల విలువ తగ్గుతూ వస్తున్నది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరాయి. ఎస్‌జీఎస్టీ ద్వారా రాష్ర్టాలకు వచ్చే నిధులు రాకపోవడం, వ్యాట్‌, వెహికిల్‌ ట్యాక్స్‌ అమాంతం తగ్గిపోవడం, విద్యుత్‌ సుంకాలు రాకపోవడం, పన్నేతర ఆదాయం కూడా లేకపోవడం, రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడంతో 21 రాష్ర్టాల రెవెన్యూ వసూళ్లు ఏప్రిల్‌ నెలలో 97,100 కోట్ల మేర రానిబాకీలుగా మిగిలిపోయాయి. కరోనా వల్ల అన్ని రాష్ర్టాలు ఆర్థిక కష్ట నష్టాలను చవిచూస్తున్నాయి. ఆర్థిక అస్తవ్యస్థం, ఉపాధి కల్పన లేమితో ఉసూరుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించింది. సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం తమకు రావాల్సిన నిధులు ఇస్తూ తమ ప్రయోజనాల కోసం అప్పు తీసుకోవటానికి కేంద్రం వెసులుబాటు కల్పిస్తుందని రాష్ర్టాలు ఆశ పడి నాయి. కానీ కేంద్రం ప్యాకేజీని చూసిన తర్వాత పలు రాష్ర్టాలు నిరాశకు గురయ్యాయి.

‘స్వయం సమృధ్‌ భారత్‌' పేరుతో ఆర్థికాభివృద్ధికి ఉద్దీపన రూపేణ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) ఉత్పత్తి రంగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పారిశ్రామిక దేశం భారత్‌. ఆ రంగంలో ఉన్న 65 లక్షల పరిశ్రమలకు అందులో పనిచేస్తున్న దాదాపు 12 కోట్ల కుటుంబాల బాగుకోసం దాదాపు మూడు లక్షలకోట్ల ప్యాకేజీని ఉద్దీపనగా విత్తమంత్రి ప్రకటించారు. కేంద్రం రెండోసారి ప్రకటించిన ఉద్దీపనంలో యాభై శాతం ఆ రంగం అభివృద్ధికి కేటాయించడం ఆహ్వానించదగినదే. ఎంఎస్‌ఎంఈల స్వరూపాన్ని మార్చి 100 కోట్ల టర్నోవర్‌కు పెంచడం మంచి పరిణామమే. ఉద్దేశం మంచిదే అయినా అమలు విధానం ఎలా అనేది అందరి నోట్లో నానుతున్న ప్రశ్న. ఎస్‌ఎంఎస్‌ఈ లోన్‌ ఇస్తూ 12 నెలల మారిటోరియం కేంద్రం ప్రకటించడం, మళ్లీ అందులో అసలుకు వడ్డీ వసూలు చేయడం అంటే ఆ సంస్థలకు వ్యయభారమే. దీనికి బ్యాంకు మేనేజర్లు ఎంతవరకు రిస్కు తీసుకొని రుణం ఇస్తారనేది ప్రధాన ప్రశ్న. గతంలో ఇలాంటి ఉద్దీపనలు ప్రకటించినప్పుడు దానికి అనుబంధంగా రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ బ్యాంకు అధికారుల తీరు వల్ల అవేవీ సత్ఫలి తాలు ఇవ్వలేదు. 

ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10 వేల కోట్లను కేటాయించారు. ఆ రంగంలో ఉన్న యజమానులు భరోసాగా ఉండటానికి, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే 2.94 లక్షల కోట్లలో దాదాపు 45శాతం వాటా ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడులకే వెళ్తున్నది. వాటికే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది.

ఉద్దీపనల్లో మరొక కీలక చర్య 15 వేల లోపు వేతనం పొందే చిన్న ఉద్యోగులందరికీ జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు 12శాతం ఈపీఎఫ్‌ వాటాను ఉద్యోగులు, యజమానుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల 3 లక్షల 67 వేల సంస్థల్లో పనిచేస్తున్న 72 లక్షల 22 వేల     ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే మరో 43 కోట్ల మందికి ఉపయోగపడే ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈపీఎఫ్‌ కింద 2 శాతం మేర ప్రభుత్వమే మూడు నెలల పాటు చెల్లిస్తుంది. దీనికిగాను 6,750 కోట్లు ఖర్చు పెట్టనున్నది. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం నెలకు రూ.25వేలు అయితే 12 శాతం ఈపీఎఫ్‌ కింద మూడు వేలు పోను 22వేల రూపాయల జీతం వస్తుంది. ఇకనుంచి యజమాని కూడా అంతేమొత్తంలో చెల్లించడం వల్ల 3000 కలిపి నెలకు 6000 ఈపీఎఫ్‌ జమవుతుంది. దీనిని ఇప్పుడు 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం వల్ల 5వేలు మాత్రమే ఈపీఎఫ్‌ జమై రూ.1000  అసలు జీతం 22,000 కలిపి ఉద్యోగికి 23,000 వస్తుంది. ఇలాంటి చర్యతో చిన్నాచితకా ఉద్యోగులకు కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. నిర్మాణరంగంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఆయా రాష్ర్టాల పరిస్థితిని బట్టి దాదాపు 9 నెలల విరామ సమయం లభిస్తుంది. దీనివల్ల కొంతవరకు సంక్షోభం నుంచి ఆ రంగం బయటపడే అవకాశం ఉన్నది. బ్యాం కింగ్‌ ఫైనాన్స్‌ ద్వారా గృహనిర్మాణ సంస్థలకు రూ.30 వేల కోట్లను ఉద్దీపన కింద ప్రకటించారు.

వలస కార్మికులకు రూ.8 కోట్లు, రెండు నెలలకు సరిపడా ఆహారధాన్యాలు ఇస్తామనడం, ఇండ్ల  కిరాయి చెల్లి స్తామని ప్రకటించడం, దానికి 35 వేల కోట్లు కేటాయించడం మంచిదే. యాభై లక్షల వీధి వ్యాపారులకు 5వేల కోట్లను కేటాయించడం, తక్కువ ఆదాయం గల మూడు కోట్ల కుటుంబాలకు నాబార్డు ద్వారా 30వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టబడి అందించడం మంచి పరిణా మం. కేవలం ఆకర్షణీయమైన లక్ష్యాలను ప్రకటించ డంతోనే సరిపోదు. వాటిని సక్రమంగా అమలుచేసినప్పుడే ప్రజలకు ప్రయోజనం ఒనగూడుతుంది.

(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు)


logo