మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 23:29:39

ఇక పైలమే..

ఇక పైలమే..

ఒకప్పుడు..

ఎవుసమంటే దండుగ

కానీ నేడది పండుగ

ఆశించేస్థాయి నుంచి

ఆదుకునే స్థాయికెళ్ళింది!

తెలంగాణ వచ్చినంక

బీళ్లకు నీళ్ళొచ్చి కడుపారా తడిపింది

రైతుల దశ మారింది

ఆత్మహత్యల సుడిగుండం నుంచి

ఆత్మగల్ల మాగాణమైంది

ఎవుసం.. ఇక నవశకమిప్పుడు!

ఏరువాక దండిగా

ఆశలు నింపుతున్నది

కృషీవలుడెప్పుడూ ఋషితుల్యుడే

సేద్యమెప్పుడూ యజ్ఞ సమానమే..!

ఆరుగాలం కష్టం ఇక

దళారీలు దోచుకోలేరు

పునాస పంటలు అమాస కాదు

రైతుబంధు, రైతు బీమా

పొద్దస్తమూ ఉచిత కరెంటుతో

కర్షకుడి జీవితం రజనుకొచ్చింది

నూతన ఆలోచనలతో

హరితవిప్లవం ఆవరించింది

అన్నదాతల మోములు విరిశాయి

ఆరుద్ర పురుగు 

మరింత అందాన్ని ఒలకబోస్తది

ఇగ రందిలేదు.. 

తెలంగాణలో రైతేరాజు!


logo