బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 15, 2020 , 23:12:27

మరణ మృదంగం

మరణ మృదంగం

విశ్వ మానవాళిని

విలవిలలాడిస్తున్న ‘విషాణువు’ను

భౌతికదూరం పాటించి 

శుభ్రతను జోడించి తరిమేద్దాం!

తాత్కాలిక ఇబ్బందులున్నా

దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందేద్దాం!

నిరాశను నిర్మూలించి

ఆశను శ్వాసిద్దాం ఉత్సాహంగా

మహమ్మారితో జాగ్రత్తగా ఉందాం!

అడ్డా కూలీల, వలస కూలీల

దినసరి కూలీల స్థితికి స్పందించి

బాధ్యతతో సాయం చేద్దాం

స్వార్థరహిత సేవలందిస్తున్న

వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పేద్దాం!

కరోనా సృజియించిన

మరణమృదంగం మరిచి

‘బహుజన హితాయ’

‘బహుజన సుఖాయ’

మంగళధ్వనుల మనసారా విందాం..!

డాక్టర్‌ చిట్యాల రవీందర్‌ ,77988 91975


logo