ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 14, 2020 , 22:56:08

మేల్కొలుపు..

మేల్కొలుపు..

కమ్ముకున్న కరోనా మేఘాలు తేలిపోలేదు

ముసురుకున్న ముప్పు చీకట్లు తొలగలేదు

ఇంకా..

ఎక్కడో ఏదో తెలియని సలవరం

ఏ మూలనో మృత్యువు 

పొంచి ఉన్న కలవరం

ఇంతగా అలుపెరుగక తలపడుతున్నా..

శత్రువు తలవంచని వైనం

హెచ్చు మీరుతున్న సంక్షోభం

అయినా..

అప్రమత్తత వీడొద్దు యుద్ధకాలం పెంచొద్దు

మడమ తిప్పొద్దు మరణం చెంత వాలొద్దు

లాక్‌డౌన్‌ తాళాలు తెరుచుకోవచ్చు

ఆంక్షలనుకున్న నియమాలు సడలొచ్చు

అంత మాత్రానికే

శత్రుసంహారం జరిగినట్లు

స్వేచ్ఛగా విహరించొచ్చని మురువొద్దు

యథా కార్యకలాపాల్లో మునిగి తేలొద్దు

ఇపుడు..

అందరం కరోనాతో కలిసి నడువాల్సిందే

ఎవరికి వారు ఒంటరి పోరు చేయాల్సిందే

అందుకే..

కరోనా మేల్కొలుపు పాఠం మదిల పొదిపి

మరో మనిషిగా జీవనప్రస్థానం సాగించు...


logo