గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - May 13, 2020 , 23:02:16

సహజీవనాల సమయం

సహజీవనాల సమయం

అప్పుడే ఏమీ పూర్తయిపోలేదు

రాలిన ఆకుల మధ్య దారి చూసుకుంటూ

ఎక్కడో ఓ చోట పచ్చని అరణ్యమింకా

మిగిలే ఉందన్న ఆశతో నడువాలేమో

ఇది సహజీవనాల సమయం!

చావూ నీవూ.. చేయీ చేయి పట్టుకొని సాగిపోవాలి

బతికున్నామో లేదోనన్న

సందేహం వచ్చినప్పుడల్లా

గుండెను కదిపి చూసుకుంటుండాలి

రక్త ప్రవాహం గట్టకట్టకుండా

శ్వాసను సైతం వెచ్చబరుచుకుంటుండాలి

తేనెపట్టు మీద రాళ్ళేసి

ఎంతదూరమని పారిపోతాం?

ఇప్పుడు మనిషి చుట్టూ 

వలయాలు వలయాలుగా మృత్యు కీటకాలు!

ఇది కచ్చితంగా ప్రకృతి హెచ్చరికల్ని 

చెవికెక్కించుకోవాల్సిన సమయం

అప్రమత్తతతో నడక సాగించాల్సిన కాలం

వైరస్సులతోనో విపత్తులతోనో

నెట్టుకురావాల్సిన సహజీవనాల సమయం!


logo