గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - May 12, 2020 , 23:56:24

గోదారమ్మకు రెక్కలు

గోదారమ్మకు రెక్కలు

‘నీరు పల్లమెరుగు’ అన్నది లోకప్రవచనం. ‘కాదు, ఎత్తుకు ఎగురు’ అన్నది సీఎం కేసీఆర్‌ వచనం. ఎక్కడో అడవుల్లో పారే గోదావరికి రెక్కలు తొడిగి ‘మా పల్లెలను పలుకరించి పోవమ్మా’ అంటూ వందల మెట్లెక్కించి వేల పల్లెలను పులకరింపజేసి లక్షల ఎకరాల బీడు భూములను పంట భూములుగా చేసిన అప ర భగీరథుడు కేసీఆర్‌. అటు అప్పర్‌ మానేరు, ఇటు లోయర్‌ మానేరు ఉన్నా ఎన్నడూ నీటి తో నిండక, నిండినా ఇక్కడిదాక అందక తాగుకు, సాగుకు నీళ్లు నోచుకోని ఎదురుగడ్డ మా మానకొండూర్‌ నియోజకవర్గం. తలాపు న లోయర్‌ మానేరు ఉన్నా ఎప్పుడూ నీటికి కటకటే. ఊరూరుకు పేరు పడిన చెరువులు న్నా ఎన్నడూ నిండిన జాడ లేదు, అలుగు దుంకి తే చూడలేదు. 

ఎనుకట కళ్లేపల్లి దగ్గర ఉన్న ఎక్కాచెరువు నిండితే మగ్గం గుంటల నీళ్లు ఊరేవట. నా ఎరుకలో అందులోకి నీళ్లు రాలే. ఉమ్మడి రాష్ట్రంలో నాయకుల మోసపుమాటలు నమ్మ ని గాలిపెల్లి రైతులు సాగునీటి కోసం బిక్కవా గు నుంచి ఊరిలోని చింతలచెరువు దాకా ఆరు కిలోమీటర్లు కాలువను తవ్వుకున్నారట. అటు కళ్ళేపెల్లి రైతులు కూడా అలాగే చేశార ట. అయినా బిక్కవాగు వారి దుఃఖం తీర్చలే దు. చింతల చెరువుతో చింతలు పోలే. ఎక్కా చెరువు రైతుల చిక్కులు బాపలేదు. వరదలు పారితే నీటిచుక్క జారుతుందని తోటపల్లి చెరువు వైపో, శనిగరం ప్రాజెక్టు వైపో ఆశగా చూడాల్సిందే. చినుకు పడితేనే నాగలి నడు స్తది. కొద్దో గొప్పో ఇక్కడి వ్యవసాయమంతా బోర్లు, బావులతోనే. 

ఏండ్లకేండ్లుగా నాయకులు వరదకాలువ , మిడ్‌మానేరు పేరు జెప్పి అదిగో నీళ్లు, ఇదిగో వచ్చె అని కాలం గడిపారు. ఎండకాలం వస్తే చాలు తాగునీటికి కూడా లేక పల్లె అతలాకుతలమయ్యేది. ఏండ్లకేండ్ల నడిగడ్డ కన్నీటి కథ కు ముగింపు పలుకడానికి కాలం కేసీఆర్‌ రూపంలో వచ్చింది. నీరు పల్లమెరుగు అన్న సత్యాన్ని తిరుగరాసి గోదావరి తల్లికి రెక్కలు తొడిగింది. ఎగిరొచ్చిన గోదావరి పల్లెపొలాల పాదాలు తడిపింది. ఇప్పుడు ఆరు మండలా ల మానకొండూర్‌ నియోజకవర్గం జలాశయమైంది. నీటిచుక్క కోసం ఎదురుచూసిన బీడు నేల నేడు మూడు దిక్కుల నీళ్లతో ద్వీప కల్పమైంది. ఓ వైపు మాన్వాడ వద్ద 26 టీఎంసీలతో మిడ్‌మానేరు ప్రాజెక్టు, అంతగిరి వద్ద అన్నపూర్ణ ప్రాజెక్టు, మరోవైపు పెద్దకోడూ ర్‌ సందులాపూర్‌ వద్ద మూడు టీఎంసీలతో రంగనాయకసాగర్‌ ఇప్పుడు నిండుకుండల య్యాయి. కుడి, ఎడమ రెండు కాలువలతో దాదాపు లక్ష ఎకరాలకు పైగా నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తెలంగాణ వచ్చిన పదినెలల్లోనే పూర్తయ్యాయి. అరువై ఏండ్లుగా నీటికోసం ఎదురుచూస్తున్న మానకొండూర్‌ నియోజకవర్గం అరువై నెలల్లోనే కన్నీళ్లను తుడుచుకొని సాగునీళ్లను చూసింది.

180 టీఎంసీల నీటి సామర్థ్యంతో బ్యారేజీలు, 150 టీఎంసీలతో రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, 82 పంపులతో ప్రపంచ సాగునీటి చరిత్రలోనే కొత్త అధ్యాయం తెరిచింది కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిద్వారా గోదావరి నది తెలంగాణ పల్లెల కోసం వెనక్కి మళ్లింది. వం దల మీటర్లు రెక్కలు కట్టుకొని కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరులోకి, అక్కడినుంచి తిప్పాపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరి 90 మీటర్ల ఎత్తు ఎగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి చేరింది. అన్నపూర్ణ నుంచి 116 మీటర్ల ఎత్తుకు ఎగిరి రంగనాయకసాగర్‌ చేరింది. ఈ మూడు ప్రాజెక్టుల నీటి పారుకం మానకొండూర్‌ నియోజకవర్గానికి ఉన్నది. దాదాపు అరువై గ్రామాల బీడు భూములను పంటభూములుగా చేసింది. ఇదొక్కటే కాదు. అటు సిద్దిపేట, ఇటు సిరిసి ల్ల, వేములవాడ జిల్లాలతో సహా తెలంగాణలోని 13 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు  సాగునీరు అందిస్తున్నది. తెలంగాణను సస్యశ్యామ లం చేసి సాగునీటి  ప్రాజెక్టులు కట్టి ప్రజల బాధలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజ ల తరపున శతకోటి వందనాలు.

(వ్యాసకర్త: మానకొండూర్‌ ఎమ్మెల్యే)


logo