గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - May 11, 2020 , 23:06:03

ఎన్నాళ్లీ దాగుడుమూతలు!

ఎన్నాళ్లీ దాగుడుమూతలు!

నూతన వధూవరులు

మురిపెంగా పెండ్లిలో ఆడే 

బంతులాటలోని పూలబంతిలా

రంగురంగుల్లో ఉన్నవు కదా!

నీకేం రోగం?

విశ్వమంతటిని మస్తుగా వణికిస్తున్నవ్‌?

చూపులకు ముద్దుముద్దుగా ఉన్నవ్‌

నీకేం పోయేకాలం?

మాటున చేరి దాచుకొని

దాడిచేస్తూ వణికిస్తున్నవ్‌

జాతి దేశ భేదం లేకుండా

ప్రపంచాన్ని వధ్యశిలపై ఎక్కించి

వికటాట్టహాసం చేస్తున్నవ్‌!

కౄర రాక్షసులెవరూ

మనలేదు గీ భూమ్మీద

కరో.. న? కుచ్‌.. అని ఆర్తితో

లోకులు హాహాకారాలు చేస్తున్నరు!

వినిపిస్తలేదా?

జల్దినే అస్త్రమేదో నిన్ను బంధిస్తది!

నీ ఆటలు కట్టేస్తది

నీ గర్వాన్ని అణిచేసి

దీపావళి జరుపుకునే రోజులు

దగ్గరపడుతున్నయి!

గంతే! గంతదన్కనే

నీ ఆటలు.. దాగుడుమూతలు..

మమ్మల్ని లాక్‌డౌన్‌ చేసి

అష్ట దిగ్బంధం చేసి 

                మురిసిపోతున్నవ్‌

పకపక నవ్వుతున్నవు కరోనా!

దాస్కొని దెబ్బకొట్టే నీ గుణం 

ఎన్నాళ్ళో సాగదు!

నీవు బయటకు రాక తప్పదు!

నీ అసలు రూపం రంగు

బయటపడక తప్పదు

నిన్ను చంపే అస్ర్తాలు

తయారవుతున్నయి!

నిన్ను చుట్టుముట్టే రోజులు

ఎంతోదూరంలో లేవు

ముద్దులొలికే కరోనా

తస్మాత్‌ జాగ్రత్త.. జాగ్రత్త..!


logo