బుధవారం 08 జూలై 2020
Editorial - May 11, 2020 , 23:06:03

అమ్మ తర్వాత అమ్మ.. నర్సు

అమ్మ తర్వాత అమ్మ.. నర్సు

కరోనా కల్లోలంతో ప్రపంచదేశాల న్నీ విలవిల్లాడుతున్న తరుణంలో ఏప్రి ల్‌ 7న ప్రపంచ ఆరోగ్యదినం, మే 12న వచ్చిన ప్రపంచ నర్సుల దినోత్సవం దేశాలన్నిటికి దిశానిర్దేశం చేయాల్సిన సందర్భం. నేడు శాస్త్ర, సాంకేతిక రంగా ల్లో ఎంతో అభివృద్ధి చెందామని అనుకునే సమయంలో కరోనా వైరస్‌ ప్రపంచదేశాల ప్రజారోగ్య వ్యవస్థను సమీక్షించుకోవాలని హెచ్చరిస్తున్నది.ప్రపంచీకరణ, ప్రైవే టీకరణలో ప్రజారోగ్యాన్ని మరిచిన విషయాన్ని కరోనా కల్లోలం గుర్తుచేస్తున్నది. కరోనా వైరస్‌తో లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న వేళ రోగుల సేవలో నర్సులు కీలకపాత్ర పోషిస్తున్న తరుణంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఇది ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జన్మదినం. ఆమె రాసిన ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌' ఇప్పటికీ చదివితీరాల్సిన పాఠ్యగ్రంథం.

బ్రిటన్‌, రష్యాల మధ్య తలెత్తిన యుద్ధంలో గాయపడినవారి వేదనలు నాడు అందరినీ కదిలించాయి. గాయా ల కంటే అంటువ్యాధులు ఇన్ఫెక్షన్లు వాళ్లను మృత్యు ఒడిలోకి తీసుకెళుతున్న నేపథ్యంలో నైటింగేల్‌ యుద్ధ సైనికుల కు చికిత్స అందివ్వడంలో కీలకపాత్ర పోషించారు. కరోనాతో ప్రపంచం విలవిల్లాడుతున్న నేటికి ఆమె జన్మించి 200 ఏండ్లు కావడం యాదృచ్ఛికం. మనదేశంలోనూ నైటింగేల్‌ సేవలు చేశా రు.బ్రిటిష్‌ పాలనలో మనదేశంలో తీవ్ర అంటువ్యాధులు వ్యాపించిన విషయం తెలుసుకున్న నైటింగేల్‌ పరిశుభ్రత లోపించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. ఇండియాలో దవా ఖానల తీరు మెరుగుపరిచేందుకు ప్రత్యే క నర్సింగ్‌ విధానం ఉండాలని సూచించారు.

కరోనా సోకితే కన్న బిడ్డనైనా తాక లేం. జన్మజన్మల బంధమనుకున్న భార్యాభర్తలూ అంటరానివారే. స్నేహితులు, బంధువులూ ఎవరూ దగ్గరికి రా ని సమయాల్లో ఒంటరైన రోగికి బాసట ఎవరు? ఆత్మీయ పలుకరింపు, కండ్ల ల్లో కారుణ్యంతో సేవలు చేసేది ఒక్క నర్సు మాత్రమే.  సాధారణ పరీక్షలతో మొదలైన నర్సు సేవలు వైద్యుల సలహాలతో బీపీ, పల్స్‌, మందులు, ఇంజెక్ష న్లు, వైద్యసలహాలు అన్నింటికీ విస్తరిస్తాయి. ఆమె అమ్మ తర్వాత అమ్మ అవుతుంది. భారీస్థాయి వేతనాలు లేకు న్నా, ఎక్కువ పనిగంటలు, రాత్రిపూట డ్యూటీలతో ఎన్నో కష్టనష్టాలకోర్చి సమాజానికి సేవలందిస్తున్నారు నర్సు లు. వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వా లు గుర్తెరిగి బడ్జెట్‌లో భారీ కేటాయింపులివ్వాలి. ప్రజారోగ్యానికి పట్టుకొమ్మలు నర్సులు, ఆయాలు. అంటువ్యాధులు, పరిశుభ్రత గురించి గ్రామీణస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాల్సింది వారే. ఇండియాలో డాక్టర్ల కొరతే కాదు ఇరవై లక్షల మంది  నర్సు ల కొరత ఉందని లెక్కలు చెప్తున్నాయి. ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రతి ఐదు వందల మందికి ఒక డాక్టర్‌ ఉం డాలి. కానీ మన దేశంలో ఐదు వందల మందికి ఒక నర్సు కూడా లేరు.

ఇప్పటికైనా ప్రపంచదేశాలతో పాటు ఇండియా కూడా ప్రజారోగ్యానికి ఎక్కు వ నిధులు వెచ్చించాలి. నవతరం ఈ వృత్తిని ఎంచుకునేవిధంగా ప్రోత్సహించాలి. క్యూబా, జపాన్‌, తైవాన్‌ లాంటి దేశాల ఆరోగ్యవ్యవస్థలను పరిశీలించి ప్రపంచదేశాలు ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. విద్య, వైద్యరంగాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి అందరికీ మెరుగైన విద్య, వైద్యం అం దించాల్సిన అవసరమున్నది.

(నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)


logo