శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - May 10, 2020 , 23:02:18

అకాడమి అక్షర యజ్ఞం

అకాడమి అక్షర యజ్ఞం

నవలా గ్రంథాలు, యక్షగాన గ్రంథాలు, ద్విపద కావ్యాలు, పద్య కావ్యాలు, ప్రబంధ కావ్యాలతోపాటు చరిత్ర, భాష, సంస్కృతి లక్షణ గ్రంథాలతో తెలంగాణ సాహిత్యాన్ని సారవంతం చేశారు. తెలంగాణలోమరుగునపడి, అందుబాటులో లేని గ్రంథ సంపదను వెలికితీసి వెలుగులు పంచారు.

తెలంగాణ అవతరణ తర్వాత మన భాషసాహిత్య సంస్కృతులు అందలమెక్కాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి  భాష పట్ల ఉన్న అభిమానం, సాహిత్యంపై గల ప్రేమ, సంస్కృతిపై ఉన్న ప్రబలమైన అవగాహన, గౌరవ భావమే కారణం ప్రేరణం. ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ 2017 మే 2న ప్రారంభమైంది. అకాడమి ఇప్పటివరకు ఎన్నో ప్రసిద్ధ గ్రంథాలను ప్రచురించింది. తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అనుభవజ్ఞులైన రచయితలతో ఇరవై వరకు ప్రత్యేక గ్రంథాలు రాయించింది. తెలంగాణ అన్ని జిల్లాల సాహిత్య చరిత్ర గ్రంథాలను  ముద్రించింది. 

తెలంగాణలో సాహిత్య విమర్శ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి ఇప్పుడు అన్నిరకాల విమర్శ గ్రంథాలు విరివిగా వస్తున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో ‘తొలినాల్ల సోయి’,  ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం’ గ్రంథాలను ప్రచు రించింది. తెలంగాణ నవలా సాహిత్యం గురించి తొలిప్రయత్నంగా పురుడుపోసుకున్న గ్రంథం ‘తెలంగాణ నవలా వికాసం’. మరొకటి ‘తెలుగు నవలా సాహిత్య వికాసము. ద్విపద ప్రక్రియ స్వరూప స్వభావాలను గురిం చి సోపపత్తికంగా విశ్లేషిస్తూ పాకాల యశోదారెడ్డి అందించిన పరిశోధన గ్రంథం ‘ద్విపద వాఙ్మయము’ ముఖ్యమైనది. పోతన మాధుర్యమైన భాగవత పద్యాల విశ్లేషణ గ్రంథం ‘మందార మకరందాలు’ రచయిత సి.నారాయణ రెడ్డి. మరో 108 పద్యాలకు పి.యశోదారెడ్డి సరళ వ్యాఖ్యానం అందించిన గ్రంథం ‘పోతన కవితాసుధ’. పోతన జీవితాన్ని, కవిత్వాన్ని అద్దంలో చూపించే ప్రయత్నం చేసిన ఇరవై వ్యాసాల మరొక గ్రంథం ‘భావత మం దారం’. సురవరం ప్రతాపరెడ్డి ‘రామాయణ విశేషములు’, ‘సురవరం పీఠికలు’ అనే గ్రం థాలు తిరిగి పురుడుపోసుకున్నాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుకు, ఉర్దూకు విడదీయరాని అనుబంధ, సుసంబంధాలున్నాయ ని నిరూపించే ‘ఉర్దూ సాహిత్య చరిత్ర’, ‘తెలుగుపై ఉర్దూ, పారశీకముల ప్రభావం’ గ్రంథాలు విశిష్టమైనవి.

కథా గ్రంథాలు మొత్తం పాతవి, కొత్తవి కలిపి నాలుగు సంకలన గ్రంథాలు వెలువరించింది. అవి ‘మూడు తరాల తెలంగాణ కథ లు’, ‘అస్తిత్వ’, ‘పరిసరాలు’, ‘కథానికా గుచ్ఛం’. వీటిలో 149 కథలున్నాయి. తత్త్వ కవులు రాసిన 330 కీర్తనలు, తత్త్వాలు, వారి పరిచయాల సమాహారమే ‘తెలంగాణ పదకీర్తనలు’. నవలా గ్రంథాలు, యక్షగాన గ్రంథా లు, ద్విపద కావ్యాలు, పద్య కావ్యాలు, ప్రబంధ కావ్యాలతో పాటు చరిత్ర, భాష, సంస్కృతి లక్షణ గ్రంథాలతో తెలంగాణ సాహిత్యాన్ని సారవంతం చేసింది. తెలంగాణలో మరుగు నపడి, అందుబాటులో లేని గ్రంథ సంపదను వెలికితీసి ప్రాణంపోసిన అకాడమి కృషి ఎంతో ప్రశంసనీయం. 

-అట్టెం దత్తయ్య, 9494715445

(తెలంగాణ సాహిత్య అకాడమి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..) 


logo