బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 09, 2020 , 00:28:08

జలసిరి

జలసిరి

పొంగింది పొంగింది పొంగింది గంగ

పుడమితల్లి చల్లని హృదయం ఉప్పొంగ

చెట్లు చేమలు చేతులెత్తి నమస్కరించంగా

పశువులూ పక్షులూ పులకరించంగా ॥ పొంగింది ॥ 

దివి నుండి భువికి దిగిందానాడు

భువి నుండి పైకి ఎగిసిందీనాడు

నోరెండిన పొలాలకు నీరందే రోజు

నాగలి నాట్యం చేసే పండుగ ప్రతిరోజు ॥ పొంగింది ॥ 

దేవుడిపై భారంతో  దీనంగా రైతన్న

ఆకాశం వైపు చూసె రోజులు పోయాయి

కాలువలై ప్రవహించే గోదావరి జలాలు

నేలతల్లి ముంగిట్లో కురిపించును వరాలు ॥ పొంగింది ॥

ఒకవైపున పరిమళించు ధాన్యాగారం

మరోవైపు పరవశించు క్షీరసాగరం

మత్స్య  నృత్య సంబరాల మనోవిలాసం

మేకలు  గొర్రెల మందల సందడి దృశ్యం ॥ పొంగింది ॥ 

అసాధ్యమన్నది నేడు సుసాధ్యమయ్యింది

అపర భగీరథుడి దీక్ష సఫలం అయ్యింది

లక్షలాది ఎకరాలకు సుజలాం సుఫలాం

రంగనాయక సాగరానికిదే మా సలాం ॥ పొంగింది ॥

-ఆచార్య ఎస్వీ సత్యనారాయణ


logo