ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 07, 2020 , 22:57:20

బిందాస్‌గున్నం సారూ..

బిందాస్‌గున్నం సారూ..

కేసీఆర్‌ సార్‌ అసుంటి సీఎం ఉండెపట్కెనే ఇయ్యాల పైలంగ ఉన్నం. ముఖ్యమంత్రి ప్రతి మాటా ఒక తూటా లెక్కన కరోనాకు యాడున్నా తగుల్తంది. గట్లనె మాటే మంత్రం అన్నతీర్గ జనాలను లాక్‌డౌన్‌ చేసింది. అందుకే బిల్కుల్‌ బిందాస్‌ ఉన్నం. లేకపోతే కరోనా ఇప్పట్ల ఈ మాత్రమన్న కంట్రోల్‌ ఐతుండెనా..! అయ్య.. మా అయ్య కేసీసారు కడుపు సల్లగుండాలే.. అందరి నోట్లల్ల ఇదే మాట.

మన ముఖ్యమంత్రి సార్‌ చేస్తున్న జబర్దస్త్‌ కరోనా జంగ్‌తోని ఈడ ఆడ కాదు ఆంధ్రల, అమ్రికాల ఇంకా ఎక్కడెక్కన్నో దేశాలళ్ల కూడ తెలంగాణ శక్తి కేసీఆర్‌ అని అంటుండ్రట. 

దేశమంత లాక్‌ డౌన్‌ ఉండికూడ అక్కడక్కడ ఆగమాగమైతుంటె, కొంత ఫికర్‌ పడుతున్నా ఇక్కడ తెలంగాణల మాత్రం అట్ల లేదు. కేసీఆర్‌ సార్‌ తన ప్రజ్ఞాసారాన్ని, ఈ కష్టకాలంలో పిడికిలి బిగించి కరోనా క్రిమిసంహార పోరాటం చేస్తున్నడని అందరు అనవట్టిరి.

రాష్ట్రంకోసం ఒక్కటైనం అట్లనే కరోనా సంహారం కోసం కూడా ఒక్కటైదాం.. అన్నట్టుగా అందరినీ సరైన సమయంలో అప్రమత్తం చేసిన కేసీఆర్‌ సార్‌ సంకల్పబలమే తెలంగాణ పరిరక్షణకు రక్ష. ఎక్కడికక్కడ కట్టలు కట్టి, తన జనాన్ని పదిలపర్చుకోవడం చూస్తే.. ఒక తండ్రి తన కుటుంబాన్ని ప్రయాసలు వడి కాపాడుకుంటున్న తీర్గ అనిపిస్తాంది. 

ఆ నడ్మ లాక్‌డౌన్ల తెలంగాణ జనాల్ని కంట్రోల్‌ చేసెతందుకు తన చేతులతో దండం పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణల ఆపతి ఎక్కువగాకుండా ఎవ్వల తరంగాని పను లు చేసిండు. ఎట్ల పడితె అట్ల తిరగకుండ గట్టిగ కట్టిపడేస్తున్న కంటెన్మెంట్లు, కొరంటెన్లు నా సామిరంగ ఇప్పుడు లోకమంత తెలుసుకునేలా చేసిందని జనం అంటాండ్రు.

కరోనాను నియంత్రించేందుకు సారు, జనాన్ని నిమంత్రించే.. దండం పెట్టిండు. గప్పుడే అనుకున్న, సారు.. కరోనాకు కోదండం ఏసిండు అని. జనాన్ని నిమంత్రించిన తీరు సూస్తుంటే.. రక్షకుడి లక్షణమే గానొస్తున్నది. 

ఏప్రిల్‌ 20 తారీఖు తర్వాత ఒకాల లాక్‌డౌన్‌ను కేంద్రం ఎత్తివేసుంటే.. లేదా మే 4 తర్వాత ఎట్లుంటదో అనుకున్నోళ్లకు.. పైసల కన్న పానాలు ముఖ్యమన్న కేసీఆర్‌ సార్‌.. అందరం పైలంగా ఉంటమనుకునేదాక ఓపిక పడ్దామన్నడు. ఇంక జెరన్ని దినాలు ఇంకింత సీరియస్‌గా తీసుకుందాం అని ఒక మాస్టర్‌ లెక్క జనాన్ని బుధ్గరిస్తానే కరోనాకు భయం పెట్టిండు. 

అందుకె గత్తర ఇగ రేపో మాపో పత్తాలేకుండా పోయేటట్టుగానే ఉం ది పరిస్థితి సూస్తుంటే. మన కుత్కెల జేరి సర్దిజెరంతోని పానాలు ఆగమాగం చేద్దమనుకున్న కరోనా కుత్కెనే పిస్కి పిస్కి మల్ల ఇటెంకల్ల వస్తె నీ సంగతి అంతే అని చెప్పినట్టయింది. తెలంగాణ జనం సంగతి దెల్వది, కరుణసూపితె కడుపుల వెట్టుకుంటరు.. నేను మిమ్మల్ని ఖతం చేస్తా అంటె మాత్రం మాకాడ నక్రాలా అని కాళ్ళువట్టి బండకు కొట్టి బగాయిస్తరు. 

కరోనాను తరిమికొట్టెదాక అవసరమైతే ఉపాసం ఉంటాం అని ప్రజ లు పూర్తిగా, స్ఫూర్తిగా సహకరిస్తు న్న తీరు నిజంగా సూపరు. ఊరూ రు కరోనా భరతం పట్టేతట్టు ఆన వట్టిండ్రు.. జనం కేసీఆర్‌ను ఎంత అర్థం చేసుకున్నరో.. ఆయ్న గూడ జనం ఆపతి గట్లనే అర్థం జేస్కున్న డు.. సారు కడుపు సల్లంగుండా. 

- మాచనశైలజా రఘునందన్‌

- రఘునందన్‌ మాచన


logo