గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 23:07:02

విపక్షాల వింత పోకడ

విపక్షాల వింత పోకడ

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. మొదటినుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలను జాగరూకులను చేశారు. తత్ఫలితంగా జీహెచ్‌ఎంసీతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.

కరోనా ఆపత్కాలంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.1500 సాయం, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం రెండు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్నది. అకాలవర్షంతో  ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పిస్తున్నది. దీన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు తమ అక్కసునంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వెళ్లగక్కుతున్నాయి.

కరోనా ప్రమాదం నుంచి బయపడటానికి ప్రభుత్వం, ప్రజలూ నిబద్ధతతో కృషి చేస్తుంటే, ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం ఇది కంటగింపయ్యింది. గత కొన్నేండ్లుగా ఎలాంటి విజయా ల్లేక ఉనికి కోసం వెంపర్లాడే స్థితిలో ప్రతిపక్ష పార్టీలు వింత వాదనలు చేస్తున్నాయి. సమ యం, సందర్భం లేకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వారికివారే అభాసుపాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్న దంటూ ఇక్కడి బీజేపీ ఎంపీలు గోల చేస్తున్నా రు. కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతుంటే ఓర్వలే క ప్రభుత్వం పరీక్షలు చేయట్లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలకు దిగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ప్రధాని, ఇతర మంత్రులు తెలంగాణలో కరోనా నివారణ చర్య లు బాగున్నాయని కితాబిస్తుంటే వీళ్లు మాత్రం, శవాలపై పేలాలేరుకునే చందంగా కరోనాను కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి అయితే మరీ అధ్వాన్నం. వీరింకో అడుగు ముందుకేసి ‘రైతు సంక్షేమ దీక్ష’ పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారు. అసలు కాంగ్రెస్‌ పార్టీకి రైతుల గురిం చి మాట్లాడే అర్హత ఉందా? సమైక్య పాలనలో మంత్రులుగా ఉన్నప్పుడు వీళ్లేం చేశారు? తలాపున గోదారి పారుతున్నా పక్క ప్రాంతానికి నీళ్లు తరలించుకుపోతుంటే పదవుల్లో ఊరేగుతూ, మంగళహారతులు పట్టిం ది నిజం కాదా! ఉమ్మడి పాలనలో రైతు ఆత్మహత్యలకు కారకులెవరు? కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనుసరించిన విధానాలు కారణం కాదా?

కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించగానే రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకు కొంటామని ప్రకటించారు. అదికూడా వారి గ్రామాల్లో నే కొనేవిధంగా ఏర్పాటుచేశారు. ఇప్పటికే చాలావరకు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం చివరిగింజ వరకు కొనేందుకు సిద్ధంగా ఉండి, అందుకోసం ముప్పై వేల కోట్ల పైచిలుకు కేటాయించటం అందరికి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగం, సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈసారి ధాన్యం దిగుబడి రికా ర్డు స్థాయిలో వచ్చింది. ఎండకాలంలో సైతం నిండుకుండలా ఉండే చెరువులను నేడు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. దురదృష్టవశాత్తూ కరోనా వైరస్‌ రూపంలో విపత్తు వచ్చిపడటంతో పెద్దమనసుతో ప్రభుత్వం రైతులను ఆదుకుం టున్నది. ఈ అంశాన్ని కూడా రాజకీయకోణం లో చూసి విమర్శలు చేయడం సిగ్గుచేటు. పం డించిన ధాన్యాన్ని ఏ రైతు తగలబెట్టడు. ప్రతిప క్ష నాయకుల రెచ్చగొట్టే మాటలతో ప్రభావితమై రైతులు ఆగం కావద్దు. వారు ఎప్పటికీ రాజకీ య అవకాశవాదులే. వారి మాయలో చిక్కి రైతులు నష్టపోవద్దు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటున్నది. వలసకూలీల ను రాష్ట్ర ప్రభుత్వం వెళ్లగొడుతున్నదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం వారి అవగాహనారా హిత్యానికి నిదర్శనం. వలస కూలీలను తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వామ్యులుగా గుర్తించిం ది. వారికి రూ.500, 12 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నది. వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దుతూ విషప్రచారం చేయ టం ప్రతిపక్షాలకే చెల్లింది.

కరోనా ఆపత్కాలంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజ లు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో రేషన్‌కా ర్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.1500 సాయం, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం రెం డు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్నది. అకాలవర్షంతో  ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పిస్తున్నది. దీన్ని ఓర్వలేని ప్రతిపక్షా లు తమ అక్కసునంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వెళ్లగక్కుతున్నాయి. విపత్తు సమయంలో కూడా విలువలు మరిచి రాజకీ యం చేయడం సరికాదు. ఇంతటి విపత్తులో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మెచ్చుకోవాల్సిందిపో యి వితండవాదన చేయడం శోచనీయం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ ప్రజల గొంతుకగా పనిచేయా లి. అప్పుడే ప్రతిపక్షాలకు మనుగడ ఉంటుంది. కానీ అయినదానికి, కానిదానికి ప్రభుత్వంపై విమర్శలకు దిగడం వల్ల ప్రతిపక్షాల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది.


logo