శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 23:07:00

క్రాంతిపథంలో నగరం, గ్రామీణం

క్రాంతిపథంలో నగరం, గ్రామీణం

తెలంగాణ రాష్ట్రం సమర్థ నాయకత్వంలో సమగ్రాభివృద్ధి దిశ గా పరుగులు తీస్తున్నది. సుదీర్ఘ రాజకీయ, ఉద్యమ అనుభవజ్ఞులైన కేసీఆర్‌ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌ దర్శనం తో అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు అహర్నిశలు కృషిచేస్తుంటే, యువనేత కేటీఆర్‌ శాస్త్ర సాంకేతిక రంగాల దన్నుతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేపని లో నిమగ్నమయ్యారు. గత ఆరేండ్లు గా కేసీఆర్‌, కేటీఆర్‌ జోడి గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధికి కారణమవుతున్నది.

సీఎం కేసీఆర్‌ వ్యవసాయాధారిత తెలంగాణ సమాజాన్ని సస్యశ్యామ లం చేసేందుకు కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును దాదాపుగా పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కేసీఆర్‌ చొరవతోనే కేటీఆర్‌ టీఎస్‌ఐపాస్‌ మొదలు ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసి ప్రాజెక్టులు హైదరాబాద్‌కు రావటానికి కారకులయ్యారు. తెలంగాణ జీడీపీలో వ్యవసాయరంగం వాటా 18, పారిశ్రామికరంగం వాటా 16, సేవారంగం వాటా సుమారుగా 65 శాతం ఉన్నది. అంటే పారిశ్రామిక, సేవారంగాల వాటా తెలంగాణ జీడీపీలో 82 శాతం. అందుకే తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, సేవారంగాలను విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీరంగ పరిశ్రమ లు తరలిపోతాయని జోస్యం చెప్పా రు. కానీ రాష్ర్టావతరణ తర్వాత హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు విస్తరించారు. ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి నగరాలకు విస్తరించేందుకు కృషిచేశారు. కేటీఆర్‌ కృషితోనే గూగుల్‌ సంస్థ తన ఔట్‌లెట్‌ను రూ.వెయ్యి కోట్లతో హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇండియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ ‘టీ-హబ్‌'ను స్టార్టప్‌ల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఇప్పుడు సామాజిక ఆర్థిక, వాణిజ్య, రియల్‌ఎస్టేట్‌ రంగా ల్లో అత్యంత క్రియాశీలక నగరంగా హైదరాబాద్‌ అవతరించింది. జేఎ ల్‌ సిటీ మూవ్‌మెంట్‌ ఇండెక్స్‌-20 20లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముప్పై నగరాల్లో హైదరాబాద్‌ అత్యంత క్రియాశీల నగరంగా మొదటిస్థానాన్ని దక్కించుకున్నది. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ప్రభు త్వం అనుసరిస్తున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాల కారణంగా అటు గ్రామాలు, పట్టణాలు శరవేగంగా రూపుమారుతున్నాయి. గ్రామాల్లో సాగునీటి లభ్యతతో సిరుల పంటలు పండిస్తుంటే, నగరాలు విశ్వనగరాల ను తలపిస్తున్నాయి. ఈ అభివృద్ధికి కేసీఆర్‌, కేటీఆర్‌ ద్వయం కారణమ ని చెప్పకతప్పదు. ఈ క్రమంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలువాలి. అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావా లి. అభివృద్ధి సంక్షేమాల కలనేతగా తెలంగాణను తీర్చిదిద్దాలి. ఇదే తెలంగాణ ప్రజల ముందున్న గురుతర బాధ్యత.

(వ్యాసకర్త: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు)


logo