ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 00:04:32

ప్రత్యామ్నాయ ధనంతోనే ప్రగతి

ప్రత్యామ్నాయ ధనంతోనే ప్రగతి

కరోనా వైరస్‌ మానవ జీవితాల్లో అసాధారణమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. అన్నిదేశాల్లో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థికరంగాన్ని దెబ్బతీస్తున్నది. మనదేశంలో అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఇంటివద్దనే ఉంటూ ప్రభుత్వాలకు తోడ్పాటునందిస్తున్నారు. అవినీతికి పేరుపొందిన ఉద్యోగ బృందం, పోలీసు విభాగం త్యాగధనులుగా మారి వైద్యసిబ్బందితో పాటు ముందువరుసలో నిలబడి కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు.

మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రత్యామ్నాయ ఆర్థికవ్యవస్థ అనేది భారత ఆర్థికరంగంలో కీలకపాత్ర పోషిస్తున్నదని అంగీకరించక తప్పదు. ఈ ప్రత్యామ్నాయ ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుంటాయి. ఒకటి-నల్లధనం, రెండు-అక్రమ ధనం.

ఆర్థికరంగాన్ని పునరుజ్జీవింపజేయడాని కి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ కృషిచేస్తున్నా యి. అయితే నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కింద పేర్కొన్న చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పన్ను చెల్లించడం చట్టబద్ధుడైన పౌరుడి జాతీయ బాధ్యత. పన్నులు దేశ నిర్మాణానికి ఉపయోగపడుతాయి. ఇప్పుడు అదే పన్ను చెల్లింపుదారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకురావాలి.

ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు: వచ్చే మూడు నెలల పాటు ఈ కింది చర్యలు తీసుకోవాలి. పేద ప్రజల ఖాతాలోకి డబ్బు వేసేవిధంగానే పన్ను చెల్లింపుదారులకు కూడా కొంత మొత్తాన్ని జమచేసి తోడ్పాటునందించాలి. మూడేండ్ల సగటు పన్ను లెక్కిం చి ఆ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారు ఖాతాలో వేయాలి. ఈ మొత్తం ఇరువై వేలకు మించకూడదు. వ్యాపారస్థులు, ప్రొఫెషనల్స్‌కు రూ.లక్ష వరకు జమచేయవచ్చు. వ్యాపారాలు, వృత్తు లు దెబ్బతిన్నందు వల్ల ఈ విధంగా ఆదుకోవ డం అవసరం. పన్ను చెల్లింపుదారులకు మూడేండ్ల సగటు పన్ను లెక్కించి ఆ మేర రిబే ట్‌ ఇస్తే బాగుంటుంది. వ్యాపారస్థులు, వృత్తిదారులకు లక్ష మేరకు రిబేట్‌ ఇవ్వవచ్చు. 2020-21, 2021-22 సంవత్సరాలకు రూ.లక్ష చొప్పున రిబేట్‌ ఇవ్వాలి.

వచ్చే పన్నెండు నెలల్లోపు ఈ చర్యలు తీసుకోవాలి: చిన్న, మధ్యతరహా వ్యాపారుల వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం, పెట్టుబడి వ్యయంకోసం వచ్చే సొమ్ము, ఆధారాలను ఆరా తీయకూడదు. దీనివల్ల నల్లధనం ఉపయోగంలోకి వస్తుంది. 

వచ్చే మూడేండ్ల పాటు తీసుకోవాల్సిన చర్య లు: పన్ను చెల్లింపుదారులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి. ఈ అసోసియేషన్‌ పన్ను చెల్లింపుదారుల సమస్యలను ఐటీ శాఖ దృష్టికి తీసుకువస్తుంది. పన్ను చెల్లింపుదారులు అక్రమాలకు పాల్పడితే వారిని అసోసియేషన్‌ తొలిగించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేప ట్టే ప్రాజెక్టులపై ఈ అసోసియేషన్‌ సోషల్‌ ఆడిట్‌ నిర్వహించే అవకాశం ఉండాలి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వ వ్యయంపై నియంత్రణ లభిస్తుంది.

ఇక పరోక్ష పన్నులకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాలి. వచ్చే మూడు నెలల్లో- 2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి వినియోగదారు చెల్లించే జీఎస్టీని వన్‌టైమ్‌ గ్రాంట్‌ గా ఇవ్వాలి. రూ.20 వేల వరకు ఈ గ్రాంట్‌ ఇవ్వవచ్చు. వచ్చే 12 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు.. 2020-21, 2021-22 ఆర్థిక సం వత్సరాల్లో ఎండ్‌ యూజర్స్‌కు రూ.20 వేల వరకు జీఎస్టీ విధించకూడదు. అమ్మకం దారు రూ.5 వేల వరకు తమ ఇన్వాయిస్‌ల ద్వారా తక్షణ డిస్కౌంట్‌ ఇచ్చే వీలుండాలి. కొనుగోలు దారు నుంచి సంబంధిత పత్రంలో డిక్లరేషన్‌ తీసుకొని ఈ డిస్కౌంట్‌ ఇవ్వాలి. వ్యాపా ర, వృత్తి సంస్థలకు ట్యాక్స్‌ రిబేట్‌ ఇవ్వాలి. గత మూడేండ్లుగా చెల్లించిన పన్ను సగటు మొత్తాన్ని ఈ రిబేట్‌గా ఇవ్వాలి. ఈ మొత్తం 10 లక్షలకు మించకూడదు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రిబేట్‌ ఇవ్వాలి.

12 నెలల పాటు చేపట్టే దీర్ఘకాలిక చర్యలు: ప్రత్యక్ష పన్నుల మాదిరిగానే పరోక్ష పన్నులకు సంబంధించి కూడా పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్‌ ఏర్పాటుచేయాలి.

కరోనా వైరస్‌ వల్ల ఆర్థికవ్యవస్థ కుదేలైన నేపథ్యంలో వ్యాపారస్థులను, వృత్తి సంస్థలను ఆదుకోవటం కోసం ప్రభుత్వం ఆర్థిక వనరు లు సమకూర్చాలి. జీతాలు, కూలీలు, ఇతర చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు కల్పించాలి. ఈ తోడ్పాటు అందుకు న్న సంస్థలు కనీసం ఏడాదిపాటు ఉద్యోగస్థుల ను తొలిగించకూడదు. ఈ వడ్డీలేని రుణాలను సంస్థలు, ఐదేండ్లలోపు తిరిగి చెల్లించాలి. బ్యాంకులకు ఈ సంస్థల తరఫున వడ్డీని కేం ద్రం చెల్లించాలి. వ్యాపారాలను విస్తరించుకోవటానికి ప్రాజెక్టు వ్యయంలోని 25 శాతం   క్యాపిటల్‌ సబ్సిడీ ఇవ్వాలి.

ఉద్యోగస్థులు వ్యాపారస్థులుగా మారదల్చుకుంటే ‘ప్రాజెక్టు కాస్టు’లోని 50 శాతాన్ని క్యాపిటల్‌ సబ్సిడీగా ఇవ్వాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించిన సగటు పన్నుకు పది రెట్లకు ఈ సబ్సిడీ మించకూడదు. ఈ సంస్థల కు వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం వడ్డీలేని రుణాలివ్వాలి. గత మూడేండ్లలో చెల్లించిన పన్ను సగటుకు మూడు రెట్లు ఇవ్వాలి. ఈ రుణాలు వచ్చే ఐదేండ్ల పాటు తిరిగి చెల్లించే ఏర్పాటు ఉండాలి. దీని వడ్డీని కేంద్రం బ్యాంకులకు సర్దాలి. దీనివల్ల ఉద్యోగస్థులు వ్యాపారస్తులు గా మారుతారు.

మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రత్యామ్నా య ఆర్థికవ్యవస్థ అనేది భారత ఆర్థికరంగంలో కీలకపాత్ర పోషిస్తున్నదని అంగీకరించక తప్ప దు. ఈ ప్రత్యామ్నాయ ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుంటాయి. ఒకటి-నల్లధనం, రెండు-అక్రమ ధనం. నల్లధనాన్ని చట్టబద్ధంగానే సంపాదిస్తారు గానీ పన్ను చెల్లించరు. ఇటువంటి ధనా న్ని ఇందిరా వికాస్‌ పత్ర వంటివాటిలో పెట్టవచ్చు. కాలం ముగిసిన తర్వాత ఆ డబ్బులు తీసుకోవచ్చు. ‘అక్రమ ధనం’ అంటే లంచాలు తీసుకోవడం, వసూళ్లకు పాల్పడటం మొదలైన అక్రమచర్యల ద్వారా సంపాదించినది. ఈ ధనా న్ని కూడా క్షమించి ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావాలి. ఈ విధంగా వచ్చిన ధనాన్ని వలస కార్మికులు, పేదలు మొదలైనవారికి అనాథాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించాలి. ఈ విధంగా వచ్చిన సొమ్మును మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఆ సొమ్ము ఇచ్చినవారికి శిక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలి. వారు ఈ సొమ్ముకు నిజాయితీగా ఉం టామని హామీ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. ప్రభుత్వాధికారులు, పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు పౌర ప్రముఖులు మొదలైనవారితో కూడిన కమిటీ దీన్ని ఆమోదించవలసి ఉంటుంది. అక్రమ ధనం స్వాధీనపర్చినవారి పునరావాసం కోసం ప్రభుత్వం సహకరించాలి. ఈ విధంగా వచ్చిన సొమ్మును పేదల కోసం ఉపయోగించడం వల్ల దోషులకు కూడా పాప పరిహారం అయిందనే సంతృప్తి ఉంటుంది. ఇది సంఘసంస్కరణకు దారితీస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో పోలీసులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఆదర్శప్రాయమైనది. ఈ వర్గాలలోని అవినీతిపరులు, స్వచ్ఛంగా మారడానికి ఒక అవకాశం కల్పించినట్టవుతుంది. లాక్‌డౌన్‌ సందర్భంగా నేర కార్యకలాపాలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఈ సందర్భంగా నేరస్థులు పరివర్తనం చెందడానికి అవకాశం కల్పించాలి.

ఈ విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయరంగాల్లో అక్రమ ధనం ప్రధానపాత్ర వహించకుండా అరికట్టాలి. కరో నా వైరస్‌ పేదలను, ధనికులను అన్నివర్గాల వారిని వివక్ష లేకుండా బాధిస్తుంది. అయితే ధనవంతులు తట్టుకొని పేదలు దెబ్బతింటారు. మానవాళికి ఈ ప్రమాదం జరుగకుండా నివారించగలగాలి.

(వ్యాసకర్త: చార్టర్డ్‌ అకౌంటెంట్‌)


logo