ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - May 05, 2020 , 23:58:26

కాల నిర్ణయం!

కాల నిర్ణయం!

కావాలని చేసిందో..

కాల నిర్ణయమై వచ్చిందో..

కరోనావతారంలో

కాలనాగై భూ మండలాన్నే చుట్టేసింది!

కోరలకు చిక్కినవారినల్లా 

కసితీరా కాటేస్తున్నది

కనిపించకుండానే విషం చిమ్ముతూ

చిన్నా, పెద్దా, పేదా, ధనిక 

తేడా లేకుండా చిదిమేస్తున్నది..

కనికరం లేకుండా ప్రాణులను 

ప్రాణాలతోనే పీక్కుతున్న పాపమో

కనీస ఇంగితం లేకుండా 

ప్రకృతిని చెరబట్టిన ఫలితమో

కరుణ విడిచి, మానవీయతను మరిచి

మెదిలిన కారణమో.. కానీ...

ఖండ ఖండాలకూ

కనులు తెరిపించ కదిలింది..!

కండ కావరాన్ని కాలరాస్తూ 

ఎక్కడివారినక్కడ కట్టిపడేసింది

అనిగిమణిగి నడుచుకోకుంటే

అందరినీ అణిచివేస్తుంది

కాదని విర్రవీగితే 

కాటికి పంపుతుంది..!


logo