శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 04, 2020 , 22:59:50

సాగులో మార్పే పరిష్కారం

సాగులో మార్పే పరిష్కారం

రైతుదిక రందిలేని బతుకు అనే భావన తెలంగాణ సమాజంలో క్రమంగా స్థిరపడుతున్నది. గడిచిన ఆరేండ్లలో ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా కరెంటు సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. సాగు నీటి సమస్య తీరుతున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేదు. పెట్టుబడి గోస తప్పింది. ఈ మార్పు వల్ల రైతాంగం ఎంతో ఉత్సాహంతో వ్యవసాయం చేస్తున్నది. కానీ తెలంగాణ రైతాంగం కొద్దిరోజుల్లోనే అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోబోతున్నది.

తెలంగాణలో పండించడానికి అవకాశం లేని పంటలు మినహా, రాష్ట్ర ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల ఉత్పత్తి తెలంగాణలోనే జరిగితీరాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల ఆహారపుటలవాట్లను కూడా అధ్యయనం చేసి, అక్కడికి కావాల్సిన ఆహార పదార్థాల ను కూడా తెలంగాణ నుంచి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగినట్టు సాగు విధానంలో మార్పురావడం కోసం ప్రణాళిక రచిస్తున్నది.

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ఉత్పత్తి బాగా పెరుగుతున్నది. అప్పుడు వ్యవసాయోత్పత్తుల కు సరైన ధర వస్తుందా? పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతాంగం మరో సంక్షోభంలో చిక్కుకోదా? ఇటీవల కాలంలో కొన్నిరాష్ర్టాల్లో ఈ దుస్థితిని కళ్ళారా చూశాం కూడా.

2019-20లో తెలంగాణలో కోటి 76 లక్ష ల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఇందు లో వరి 80 లక్షల ఎకరాల్లో, పత్తి 53 లక్షల ఎకరాల్లో, మక్కలు 16.08 లక్షల ఎకరాల్లో, మూడు కలిపి కోటి 49 లక్షల (85.14 శాతం) ఎకరాల్లో సాగయింది. ఇప్పటికే ఇటు దేశంలో, అటు ప్రపంచంలో ఈ మూడు పం టల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. అవసరానికి మించి ఉత్పత్తి ఉండటం వల్ల వీటి డిమాండ్‌ బాగా పడిపోయింది. ఎగుమతులు ఆశాజనకంగా లేవు.

యుఎస్‌డీఏ ప్రకటించిన వర ల్డ్‌ అగ్రికల్చర్‌ సైప్లె అండ్‌ డిమాం డ్‌ ఎస్టిమేట్స్‌ రిపోర్ట్‌ ప్రకారం 20 20 ఏప్రిల్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 182.2 మిలియన్‌ టన్ను లు, దేశంలో 28.83 మిలియన్‌ టన్నుల బియ్యం మిగులు ఉం టుంది. పత్తి ప్రపంచవ్యాప్తంగా 19.88 మిలియన్‌ టన్నులు, దేశంలో 8.7 లక్షల టన్నుల మిగులు ఉంది. మక్కలు ప్రపంచవ్యాప్తంగా 289 మిలియన్‌ టన్నులు, దేశంలో 11 లక్షల టన్నులు మిగులు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే, మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ మూడు పంటలే 85 శాతం భూముల్లో పండించడం లాభదాయక మా? నష్టదాయకమా? లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది.

తెలంగాణ రైతులు పండించిన పంటలకు మంచి ధర రాని అవస్థ ఉండవద్దనే ఉద్దేశంతో నే సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ప్రజల అవసరాలు, మార్కెట్‌ డిమాండుకు తగ్గట్లు పంటలు సాగు చేయాల ని ప్రతిపాదిస్తున్నారు. రైతుల ఆలోచనావిధానంలో విప్లవాత్మకమైన మార్పు తేవడం చాలా క్లిష్టమైనది. కానీ కష్టసాధ్యమైనది. అసాధ్యమనుకున్న అనేక లక్ష్యాలను సుసాధ్యం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు పంటల సాగువిధానం లో సమూల మార్పులు తీసుకొచ్చే బృహత్తర కార్యాన్ని భుజానికెత్తుకున్నారు.

ఎక్కడ మొదలుపెట్టి ఎట్లా ముగించాలనే విషయంలో సంపూర్ణ స్పష్టత సాధించి, పక్కా ప్రణాళిక రచించుకున్న తర్వాతే కార్యరంగంలోకి దూకడం కేసీఆర్‌ పనివిధానం. తెలంగాణలో ఏం పండించాలో తెలుసుకోవాలంటే, ముందు అసలు తెలంగాణ ఏం తింటుదో తెలుసుకోవాలని కేసీఆర్‌ భావించారు.

భారతదేశ చరిత్రలో తొలిసారిగా తెలంగా ణ ప్రజల ఆహారపుటలవాట్లు తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సర్వే జరిపించారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసె ర్చ్‌ సంయుక్తంగా సర్వే చేసి, తెలంగాణ ఏం తింటుందో తేల్చింది. రాష్ట్రం లో ఏటా 150. 72 కిలోల తిండిగింజలు (బియ్యం, మక్కలు, గోధుమల లాంటివి) తింటారు. తెలంగాణ జనాభాతో పాటు, రాష్ర్టానికి వచ్చిపోయే ప్రజలను, రైళ్లు, విమానాలకు సరఫరా చేసే ఆహార పార్శిళ్లన్నీ లెక్కకు తీసుకుంటే ఏడాదికి నాలుగున్నర కోట్ల మందికి 67.24 లక్షల టన్నుల తిండిగింజలు కావాలి. రాష్ట్రంలో 9.39 లక్షల టన్నుల పప్పు లు, 6.88 లక్షల టన్నుల నూనెలు, 3.4 5 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలు, 7.4 లక్ష ల టన్నుల మాంసాహారం, 247.32 కోట్ల లీటర్ల పాల వినియోగం జరుగుతున్నది. కూరగాయ లు, పండ్లు, చక్కెర, బెల్లం, చిరు ధాన్యాలు, తృణధాన్యాలు ఎంతకావాలో కూడా లెక్క సరిగ్గా తెలిసింది. తిండి గింజలు తప్ప మిగతా కేటగిరిల్లో చాలావరకు రాష్ట్రం దిగుబడులపైనే ఆధారపడటం దురదృష్టకరం.

కూరగాయల్లో ఎక్కువ వినియోగమయ్యే ఆలుగడ్డ తో పాటు, 19 రకాల కూరగాయల్లో 9 రకాలను దిగుమతి చేసుకుంటున్నాం. అన్ని పండ్లలో కన్నా ఎక్కు వ తినే అరటి, అన్ని నూనె ల్లోకెల్లా ఎక్కువ వినియోగించే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి తేటతెల్లమైన తర్వాత, తెలంగాణలో పండించడానికి అవకాశం లేని పంటలు మిన హా, రాష్ట్ర ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల ఉత్పత్తి తెలంగాణలోనే జరిగితీరాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల ఆహారపుటలవాట్లను కూడా అధ్యయ నం చేసి, అక్కడికి కావాల్సిన ఆహార పదార్థాల ను కూడా తెలంగాణ నుంచి పంపాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందుకు తగినట్టు సాగు విధానంలో మార్పురావడం కోసం ప్రణాళిక రచిస్తున్నది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణం గా ప్రభుత్వమే రైతులకు ఏ పంటలు వేయాలో నిర్దేశిస్తుంది. దానిప్రకారం సాగుచేసిన పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల రైతు లు నమ్మకంగా పంటలు సాగుచేసే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అటు పౌరసరపరాల సంస్థను, ఇటు మహిళా సంఘాలను, ప్రైవేటు ఆగ్రో ఇం డస్ట్రీస్‌ను సమన్వయం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. వడ్లను బియ్యంగా, మిర్చీని కారంగా, కందులు, పెసర్లు, శనగల ను పప్పులుగా, వేరుశనగలు-పొద్దుతిరుగుడు-నువ్వులు తదితర గింజలను నూనెగా మార్చడం ద్వారా అదనపు విలువ (వాల్యూ ఆడిషన్‌) చేకూర్చే పని ఎక్కడికక్కడ జరుగాల ని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో రైతులు పండించిన పంట కు వాల్యూ ఆడిషన్‌ చేయడం ద్వారా అటు రైతులకు మంచి ధర, ఇటు ప్రజలకు తక్కువ ధరకు కల్తీ లేని నాణ్యమైన సరుకులు దొరికే ఒక అత్యుత్తమ ఉత్పత్తి-వినిమయ వ్యవస్థను తయారుచేయాలని సీఎం భావిస్తున్నారు.

సాగునీరు, కరెంటు, పెట్టుబడి సాయం కారణంగా వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడుతున్నది. పండిన పంటకు మంచి ధర రానిదే వ్యవసాయరంగంలో పురోగతి సం పూర్ణం కాదు. డిమాండుకు తగ్గట్టు పంటలు వేసుకునే ఒరవడి అలవడితేనే గిట్టుబాటు ధర వస్తుంది. దీనికి కావాల్సింది రైతాంగ దృక్పథం లో మార్పురావడం, ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడమే.


logo