మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 04, 2020 , 22:57:19

మానవత్వం చాటుదాం

మానవత్వం చాటుదాం

నూటా ముప్పై కోట్ల జనాభా కలిగి న ఈ దేశంలో ప్రజలు తమ కష్టార్జితం, ఆత్మగౌరవంతో బతుకుతారు. ఎవరిపై ఆధారపడరు. ఇక తెలంగాణ ప్రజల విషయానికి వస్తే.. ఆత్మాభిమానం ఎక్కువ. ఈ ప్రాంతం పోరాటాలు, త్యాగాలకు పుట్టినిల్లు. ఆత్మగౌరవం ఎలుగెత్తి చాటిన నేల. స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి నిలిచి విజయతీరాలు చేరి గమ్యాన్ని ముద్దాడి ఐక్యతను చాటింది తెలంగాణ. 

రాష్ర్టావతరణ తర్వాత ఒక్కొక్క మెట్టుగా స్వావలంబన దిశగా అడుగు లు వేస్తున్న తరుణంలో ఇవ్వాళ కొవి డ్‌-19 రూపంలో విపత్తు వచ్చిపడిం ది. కనిపించని శత్రువుతో యుద్ధం చేయాల్సి వస్తున్నది. కాలచ క్రం ఆగిపోయింది. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో శ్రమనే నమ్ముకొని జీవించేవారి ఉపాధి ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆత్మాభిమానంతో బతికే  తెలంగాణ ప్రజలు ఎవ్వరినీ చేయిచాచి అడుగలేరు.

ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించినా సామాజిక బాధ్యత తెలియకపో తే ఆ సంపాదనకు విలువుండదు. సహాయం చేసే పెద్ద మనసు లేకుంటే మనకెన్ని మేడలు, మిద్దెలున్నా ఉపయోగం ఉండదు. కులమతాలు మానవత్వం ముందు అడ్డంకులు కాలేవు. మానవ మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఈ కులమతాలు, ఆస్తులు, అంతస్థు లు లెక్కకావు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఇప్పుడు మానవత్వం చూపించుకునే అవకాశం వచ్చింది. తమ చుట్టుపక్కల ఉన్న పేదవారిని గుర్తించి వారు పస్తులుండకుండా చూసే సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఈ విపత్క ర పరిస్థితిలో ప్రభుత్వాలు తమ శక్తికి మించి పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పేదలను అన్నివిధాలా ఆదుకుంటున్నది. అలాగే ఇక్క డ పనిచేసేందుకు వచ్చిన ఇతర రాష్ర్టాల పౌరులను సైతం తెలంగాణ పునర్నిర్మా ణ భాగస్వాములుగా గుర్తించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 అందజేస్తున్నది. కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా అహోరాత్రులు శ్రమిస్తున్నది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అన్నివిభాగాల అధికారులు శక్తివంచన లేకుండా  కృషిచేస్తున్నారు. ఈ సమయంలో వారికి అండగా నిలువటం మన సామాజిక బాధ్యత. 

మానవుడు నేడు  కాలంతో పరిగెడుతున్నాడు. సంపాదనలో పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సామాజిక బాధ్యతలను మరుస్తున్నాడు. మానవ మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు మనిషి బాధ్యతలను గుర్తెరగటమే ప్రధానం. ఈ సమయంలో మనముందున్న ప్రథమ కర్తవ్యం పేదవారికి సామాజిక బాధ్యతగా సహాయం చేయడం.

ఆధునికాభివృద్ధిలో పడి ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడంతోనే నేడు ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అభివృద్ధి పేరుతో చేసిన ప్రకృతి విధ్వంసంతోనే  ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికై నా జీవవైవిధ్యాన్ని కాపాడుతూ ముం దుకు సాగాలి. 

కరోనా వైరస్‌తో ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారు. మనవంతు సామాజి క బాధ్యతగా పేదలకు సేవచేద్దాం. పేద లు పడుతున్న ఇబ్బందులను మన వంతుగా తీర్చుతూనే ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతను గుర్తుచేద్దాం.

 (వ్యాసకర్త: వరంగల్‌ తూర్పు శాసనసభ్యులు)


logo