మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - May 02, 2020 , 23:17:13

సోయగాల జలధార

 సోయగాల జలధార

 అవనిపై గోదావరి 

గలగలల రవళులతో హొయలొలికే 

కాళేశ్వరం జలాశయం

అఖిల జనులకు సలిలం

సమకూర్చే సదాశయం!

అలుపెరుగని శ్రామికుల స్వేదధార

అపూర్వ సోయగాల జలధార 

అద్వితీయ సొరంగ  ప్రాకారం

అందాల స్వప్న సాకారం! 

హాలికుల వెతలు తీర్చే జలసిరి 

అపరంజి పంటలు కూర్చే సొగసరి 

త్రివేణి సంగమ జల ప్రాభవం

కాళేశ్వరం ప్రాజెక్టు వైభవం!

అభియంతల అద్భుత సృష్టి

జగమంతా జలనిధిపై

సారించిన దృష్టి 

అన్నదాతలపై అమృత వృష్టి!


logo