శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 02, 2020 , 00:14:05

బియ్యంపై మన ముద్ర

బియ్యంపై మన ముద్ర

రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్నబియ్యాన్ని సేకరించి, మిగిలిన సన్నబియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు, దేశాలకు తెలంగాణ బ్రాండ్‌ బియ్యంగా అమ్ముకునేవిధంగా రైస్‌ మిల్లర్లకు వెసులుబాటు కల్పించాలి. దీంతో రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. ధాన్యం పండించే విధానంలో కూడా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తే ధాన్యం సేకరణలో జరుగుతున్న వేల కోట్ల నష్టాన్ని నివారించవచ్చు.

రాష్ట్రంలో ఒక సమగ్ర ధాన్యం, బియ్యం, ఉప ఉత్పత్తుల విధానాన్ని రూపొందించటం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం సముచితం. దేశ చరిత్రలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానాన్ని రూపొందించడం ఇదే ప్రథమం కావడం అభినందించదగిన విషయం. పలు పథకాల రూపకల్పన, వాటి అమలు విషయంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా ఉన్నది. ఇప్పుడు సమగ్ర ధాన్యం, బియ్యం విధానాన్ని రూపొందించాలని కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం రైతులు, వినియోగదారులతో పాటు దేశ ఆర్థికరంగ పరిపుష్టికి తోడ్పడుతుందనటం లో ఏ మాత్రం సందేహం లేదు.

నూతన సాగునీటి ప్రాజెక్టులు, ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.24 గంటల నిరం తర విద్యుత్‌ సరఫరా వల్ల వరి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది రెండు కోట్ల 25 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించేస్థాయికి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకురావడం అద్భుత విజయం.

దేశంలో అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశం మొత్తం బియ్యం అవసరాల ను తీర్చగలిగేస్థాయికి ఎదిగింది. ప్రజల ఆహారపుటలవాట్లలో వచ్చిన మార్పులు, అంతర్జాతీయస్థాయిలో బియ్యం మార్కెట్లలో ఏర్పడిన మాంద్యం ఈ నేపథ్యం లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణ యం రాష్ట్ర ఆర్థికప్రగతికి దోహదపడుతుంది. ప్రజల ఆహారపుటలవాట్లలో వచ్చిన మార్పుల దృష్ట్యా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అన్నివర్గాల ప్రజలు సన్నబియ్యం మాత్రమే తింటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించే విధానంలో మార్పులు తీసుకురావడం అనివార్యం.

ఇప్పుడు రేషన్‌ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని చాలావరకు ఆహారంగా ఉపయోగించడం లేదు. తమ అవసరాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేషన్‌ షాప్‌ల ద్వారా పేదలకు సన్నబియ్యం కిలో రూ.10,అన్నివర్గాలకు కిలో రూ.30కు ఏడా ది పొడవునా సరఫరా చేసేవిధంగా నూతన విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ రాష్ట్రంలో పండిన వరి పంట తాలూకూ ఫలాలను ప్రజలందరికీ అందించే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్న బియ్యా న్ని సేకరించి, మిగిలిన సన్న బియ్యాన్ని ఇత ర రాష్ర్టాలకు, దేశాలకు తెలంగాణ బ్రాండ్‌ బియ్యంగా అమ్ముకునేవిధంగా రైస్‌ మిల్లర్ల కు వెసులుబాటు కల్పించాలి. దీంతో రైతుల కు కూడా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. ధాన్యం పండించే విధానంలో కూడా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తే ధాన్యం సేకరణలో జరుగుతున్న వేల కోట్ల నష్టాన్ని నివారించవచ్చు. ఏండ్ల తరబ డి తెలంగాణలో ఉత్పత్తి, తయారైన బియ్యా న్ని మాత్రమే తమకు సరఫరా చేయాలని దక్షిణాది రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒక సమగ్ర ధాన్యం, బియ్యం విధానం ద్వారా రాష్ట్ర అవసరాలతో పాటు, తెలంగాణ బ్రాండ్‌ బియ్యానికి డిమాండ్‌ పెరుగుతుంది.

అలాగే ధాన్యం పండించే విధానంలో రాష్ర్టాన్ని జోన్లుగా విభజించాలి. ధాన్యం ఉత్పత్తిలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. రవాణా విషయంలో దుబారా అరికట్టి ఆయా ప్రాంతాలకు అనువైన పంట ఆ ప్రాంతంలోనే పండించేవిధంగా రైతులను ప్రోత్సహించాలి. అంతేకాకుండా జోన్ల వారీ గా తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా (కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు పలురకాలుగా పేర్లు పెట్టినట్లుగా) నామకరణం చేయాలి. అప్పుడే మన బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడుతుంది. నిజామాబాద్‌లో పండే పంటకు, మహారాష్ట్ర ప్రాం తం లో మార్కెటింగ్‌లో బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించ డం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో పండిన సన్నరకం బియ్యానికి హైదరాబాద్‌లో మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావచ్చు. అప్పుడే మన పంటకు డిమాండ్‌ పెరి గి, రైతుకు అమ్మకం బాధ తప్పుతుంది. ఆదాయం పెరుగుతుంది.

రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాలను ఒక జోన్‌గా గుర్తించాలి. ఆ ప్రాంతంలో దక్షిణాది రాష్ర్టాల్లో డిమాండ్‌ ఉన్న పంటలను పండించాలి. తద్వారా ధాన్యానికి మద్దతు ధర సాధించవచ్చు. ఇలా రాష్ర్టాన్ని కొన్ని ప్రత్యేక విభాగాలుగా విభజించాలి. పండించిన పం ట మొత్తాన్ని కూడా మన రాష్ట్రంలోనే మిల్లిం గ్‌ చేయించాలి. తద్వారా రాష్ర్టానికి అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ధాన్యం ఉప ఉత్పత్తులైన వరి పొట్టు, తవుడు, నూకలు, పరం ద్వారా కోళ్ల ఫారాలకు, పశువులకు దాణా అవసరాలు తీర్చవ చ్చు. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైన రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ మన రాష్ట్రంలోనే అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు. ఇరువై లక్షల టన్నుల వరిపొట్టు ద్వారా రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు స్ట్రీమ్‌ సరఫరా జరుగుతుంది. వరి పొట్టు బూడిదతో తేలికైన ఇటుకలను తయారుచేయవచ్చు. దీనిద్వారా వేలాదిమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. నిర్మాణరంగాలకు ఉపయోగపడు తుంది.

ప్రధాన వరి పంటకు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవడం ద్వారా, రైతాంగాన్ని అన్నిరకాల సమస్యల నుంచి దూరం చేయవచ్చు. ఉత్పత్తిలో శాస్త్రీయ పద్ధతులు, అమ్మకంలో బ్రాండ్‌ ఇమేజ్‌ సృష్టించ టం అనేవి రైతు సమగ్రాభివృద్ధికి గీటు రాయి. 


logo