సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Apr 30, 2020 , 23:43:47

కరోనా మాయ!

కరోనా మాయ!

కరోనా ఎంత మాయ చేశావు

బంధాలు, అనుబంధాలు వద్దనుకొని

గిరి గీసుకొని తిరుగుతున్న మమ్మల్ని

ఒకచోటికి చేర్చి జీవితార్థం తెలిపావు!


ఉరుకుల పరుగుల జీవితంలో మరిచిన

స్నేహబంధాలను ఎరుక చేశావు

గాడి తప్పుతుందనుకున్న యువతరానికి

సేవాదృక్పథాన్ని నేర్పావు!


అలసట ఎరుగని అమ్మ విలువను

గాంభీర్యం వెనుక నాన్న గుండెను

పిల్లలకు అర్థమయ్యేలా చేశావు!


దేశాల మధ్య పరస్పర సహకారానికి

విశ్వమానవ సౌభ్రాతృత్వానికి వారధివై

నీ మీద యుద్ధం చేసేలా చేశావు!


అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతల

ఒడిలో రేపటితరం తీర్చిదిద్దబడేటట్లు చేశావు

ఎంత సుందర దృశ్యమది... 

ఎంత కాలమైంది చూసి!


యుగాలనాటి ఇతిహాసాలు, పురాణాలు

నీతి కథలు, కావ్యాలు మమ్మల్ని కొత్తగా

తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించావు!

కరోనా నీకు శతసహస్ర వందనాలు

మాలోకి మేము చూసుకునే విరామం ఇచ్చినందుకు

మళ్లీ తప్పులు చేయొద్దని చెప్పినందుకు!

-అట్లూరి వెంకటరమణ,95507 76152


logo