బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 29, 2020 , 23:05:01

ఆసియా దేశాలే నయం

ఆసియా దేశాలే నయం

కరోనా వైరస్‌ విజృంభణ ప్రపంచ యుద్ధ పరిస్థితులను తలపిస్తున్నది. ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో ఒక దేశం గెలిచేది, మరో దేశం ఓడిపోయేది. కానీ, ఇప్పుడు అన్నిదేశాలూ ఓడిపోతున్నాయి. వందేండ్ల కిందట వచ్చిన స్పానిష్‌ ఫ్లూ సమయంలో ప్రపంచం అంతగా ఆందోళన చెందలేదు. కానీ నేడు కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై స్పానిష్‌ ఫ్లూ కన్నా ఎక్కువ తీవ్రతతో దాడి చేస్తున్నది. అగ్రరాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాలు కరోనా వైరస్‌ ధాటికి చతికిలపడుతున్నాయి.

కరోనా విజృంభనతో అగ్రదేశాలు కుప్పకూలాయి. మేమే బలవంతులం అనుకున్న దేశాలు బేల ముఖం వేశాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో పాశ్చాత్య దేశాల కం టే ఆసియా దేశాలు మంచి ఫలితాలు సాధించాయి. ఆసియా దేశాలు పరిపాలనా అనుభవాన్ని, నైపుణ్యాన్ని, సఖ్యతను చాటుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను ఎదుర్కోవటంలో విజయం సాధిస్తున్నాయి. తక్కువ ప్రాణనష్టంతో బయటపడుతున్నాయి. కానీ  ట్రంప్‌ విధానాలతో అమెరికా ఆర్థికవ్యవస్థ దివాళా తీసింది. 

టెక్నాలజీ ఏ మాత్రం లేనినాడు స్పానిష్‌ ఫ్లూ నివారణకు ప్రపంచదేశాలు కృషిచేశాయి. అప్పటి తో పోలిస్తే, శాస్త్ర, సాంకేతికత ఇప్పుడు వేల రెట్లు పెరిగినా ప్రాణాలను కాపాడలేని స్థితి ఉన్నది. కరోనా వైరస్‌కు సంబంధించి ఏ దేశంపై  నిందారోపణలు చేసే సమయం కాదు.

కరోనా విజృంభనతో అగ్రదేశాలు కుప్పకూలా యి. మేమే బలవంతులం అనుకున్న దేశాలు బేల ముఖం వేశాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవటం లో పాశ్చాత్య దేశాల కంటే ఆసియా దేశాలు మం చి ఫలితాలు సాధించాయి. ఆసియా దేశాలు పరిపాలనా అనుభవాన్ని, నైపుణ్యాన్ని, సఖ్యతను చాటుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను ఎదుర్కోవటంలో విజయం సాధిస్తున్నాయి. తక్కువ ప్రాణనష్టంతో బయటపడుతున్నాయి. కానీ  ట్రంప్‌ విధానాలతో అమెరికా ఆర్థి కవ్యవస్థ దివాళా తీసింది. ఎంతో ప్రాణనష్టం జరుగుతున్నది. కరో నా నేపథ్యంలో ప్రజలను ఒకతాటిమీద నడిపించడంలో అమెరికా పాలకవ్యవస్థ విఫలమైంది. కనీస ముందస్తు చర్యలు తీసుకోలేదు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటానికి డబ్ల్యూ హెచ్‌వోను తప్పుపడుతూ నిధులను ఇవ్వటానికి నిరాకరిస్తున్నది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు మాత్ర మే అమెరికా చేతుల్లో ఉన్నది. అమెరికా వ్యవహా రం ఇలానే కొనసాగితే ఐఎంఎఫ్‌ కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే కరోనా ప్రభావానికి వలసవాద దేశాలు కుప్పకూలి పోతున్నాయి.

ఆసియా దేశాలైన చైనా, జపాన్‌, సింగపూర్‌,  కొరియా, వియెత్నాం, భారత్‌ వంటి దేశాలు కరో నా కట్టడికి సమర్థంగా కృషిచేస్తున్నాయి. మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. చిన్న దేశాలైన క్యూబా లాంటి దేశాలు సైతం చక్కగా పనిచేస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాలు కూడా కరోనాను నియంత్రిస్తున్నాయి.  కరోనా పట్ల భారత్‌ అనుసరిస్తున్న విధానాలను ప్రపంచదేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. భారత్‌లో వేల సంఖ్యలో మాత్రమే కేసు లు నమోదయ్యేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టా యి. కేరళ, తెలంగాణ రాష్ర్టాలు దేశానికి దిక్సూచి గా నిలుస్తున్నాయి. కరోనా ఉపద్రవాన్ని ముందు గుర్తించిన కేరళ దానిని అదుపుచేయడంలో విజయం సాధించింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అమలుచేస్తున్న విధానాలను దేశం ప్రశంసిస్తున్నది. దేశంలో ముందు గా లాక్‌డౌన్‌ ప్రకటించిన తెలంగాణ, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కూడా ముందు నిలిచింది. ప్రజలకు రేషన్‌ బియ్యంతోపాటు, ప్రతి కుటుంబానికి రూ.1500 అందించి ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యతను చాటుకున్నది. కరోనా వైర స్‌ కట్టడికి చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల కష్టాలను కూడా తీర్చినప్పుడే సఫలత చెం దినట్లుగా భావించాలి.


logo