బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 29, 2020 , 23:01:15

వైద్యమే నైవేద్యం

వైద్యమే నైవేద్యం

ఇప్పుడిక్కడ అణ్వాయుధాలపై చర్చల్లేవు

రాజకీయ రసా-బాసల్లేవు

నిశ్శబ్దం.. నిశీధిలాంటి నిశ్శబ్దం..

డిపోల్లో డిపాజిట్లయిన బస్సులు

పట్టాలపై పరుగెత్తని రైళ్లు

రెక్కలు విప్పని విమానాలు

మనుషులిప్పుడు

తలుపులకు తాళాలేసుకుంటున్నరు..!

ఎక్కడ.. ఆ దేవుడి జాడెక్కడ

గుళ్లల్లో అర్చనలాగాక

మసీదుల్లో నమాజులు అటకెక్కాక

చర్చిల్లో ప్రార్థనలు పడకేసాక..!

అడవులను నరికి-జీవాలకు ఉచ్చులేసి

కరువొచ్చినట్లు కనబడ్డదాన్నల్లా తినేసి

కాటేయగానే కరోనా

కొవిడ్‌-19 పేరెట్టి చేతులెత్తేస్తివి..!

తప్పొకరిది-శిక్ష మరొకరికి

స్వర్గం సంగతేమో కానీ

అడుగడుగున నరకమిప్పుడు

ఇప్పుడిక్కడ.. కరచాలనాల్లేవ్‌

చేతులు కడుక్కోవడం తప్ప

హద్దుల్లేవు-సామాజిక దూరం తప్ప

నమస్కారం ఇప్పుడు సంస్కారమైంది

ఇప్పుడు..

వైద్యులే దేవుళ్లు-వైద్యమే నైవేద్యం

యుగాంతం నుంచి

శాస్త్ర విజ్ఞానమొక్కటే రక్ష..!


logo