గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 28, 2020 , 23:40:22

నీటిబొట్టులో నీ రూపమే

నీటిబొట్టులో నీ రూపమే

తెలంగాణ ఉద్యమ తొలిరోజుల్లో నీటి విషయాలపై రామరాజు విద్యాసాగర్‌రావు రాసిన వ్యాసా లకు మంచి ఆదరణ లభించింది. నీటి విషయాలపై నిజానిజాలు, తెలంగాణ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి లోతైన అధ్యయనం చేసి, తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ఆయన ఒకసారి జలసౌధకు వచ్చారు. అప్పుడు ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. నేడు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి నెమరువేసుకోవా లని ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.

సాగునీటిరంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై విద్యాసాగర్‌రావు అనేక వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలను ‘నీళ్ళు-నిజాలు’ అనే పేర పుస్తకం గా విద్యావంతుల వేదిక, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం తరపున ప్రచురించాం. ఆ పుస్తకానికి మంచి ఆదరణ రావ డంతో 2008లో రెండోసారి కూడా ముద్రించాం. ‘నీళ్లు-నిజాలు’ పుస్తకం రెండవ భాగం కూడా ముద్రించాల్సి వస్తుందని ఊహించలేకపోయాం. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జలయజ్ఞాన్ని విశ్లేషించక తప్పదనుకున్నారు. జలయజ్ఞం తాత్త్విక భూమికను ఎరుక పరుచడంలో విద్యాసాగర్‌రావు చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. ప్రభుత్వంలో ఉన్న నాలాంటి ఇంజినీర్లందరికీ కనువిప్పు కలిగించేవిధంగా ఆయన రచనలు సాగాయి.

2012లో విద్యాసాగర్‌రావు రాసిన రెండో దశ వ్యాసాల ను ‘నీళ్ళు-నిజాలు-2’గా తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం సంయుక్తంగా ప్రచు రించాయి. ఈ రెండో సంపుటానికి కూడా విద్యాసాగర్‌ రావు నాకే సంపాదకత్వ బాధ్యతలు ఆప్పగించారు. ఈ రెం డో సంపుటాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించి విద్యాసాగర్‌రావును అభినందించినారు. నేను 2019 డిసెంబర్‌లో ‘కాళేశ్వరం ప్రాజెక్టు-తెలంగాణ ప్రగతి రథం’ అన్న పుస్తకాన్ని విద్యా సాగర్‌రావు దివ్యస్మృతిలో ప్రచురించాను. దీన్ని ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాగానే కేసీఆర్‌ విద్యాసాగర్‌రావును సాగునీటి సలహాదారుగా నియమించారు. నేను సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు దగ్గ ర ఓఎస్డీగా చేరాను. అప్పుడు విద్యాసాగర్‌రావుతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని తక్షణ నిర్ణయాలు తీసుకున్నది. దుమ్ముగూడెం నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టును రద్దుచేసింది. ప్రాణహిత-చేవెళ్ళ, దేవాదుల, దుమ్ముగూ డెం ఎత్తిపోతల ప్రాజెక్టులను కూలంకషంగా మథించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనా అనుమతులిచ్చి అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సమీక్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడంతో పా టు విధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరు ద్ధరించుకోవడం కోసం మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడానికి కేంద్రప్రభుత్వ వేదికలపై పోరాటా న్ని కొనసాగించింది. ఈ అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో కలిసి రోజులతరబడి సాగిన మేధోమథనంలో విద్యాసా గర్‌రావు భాగస్వాములు.

ముఖ్యంగా కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు, సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పోరాటంలో విద్యాసాగర్‌రావు సలహాల మేరకు అఫిడవిట్లు తయారయ్యాయి. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావే శాల్లో విద్యాసాగర్‌రావు సమర్థవంతంగా వాదనలు విని పించారు. ఆయన వాదనల ధాటికి తట్టుకోలేక, ఆయన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక బోర్డులో ఆయన పాల్గొనడాన్నే ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయా రు. ఒక సమావేశంలో ‘ఈ సమావేశానికి నేను తమాషా చేయడానికి రాలేదు. తెలంగాణ ప్రయోజనాలను రక్షించడానికి వచ్చానని ఆం ధ్రా ప్రాంత ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు ఇక తమ పప్పులుడుకవని భావించి రాజకీయ పదవి నిర్వహిస్తున్న విద్యా సాగర్‌రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొనడానికి అర్హుడు కాదంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభు త్వం ద్వారా లేఖ రాయించారు. తనవల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి విద్యాసాగర్‌రావు స్వచ్ఛం దంగా తప్పుకున్నారు. అయి తే బోర్డు సమావేశా లు జరిగేముందు తప్పనిసరిగా సమీక్ష జరిపి రాష్ట్ర ప్రతిని ధులకు సూచనలు చేసేవారు. మన వాదనలు ఎట్లా ఉండా లో నిర్దేశించేవారు.

కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు, సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పోరా టంలో విద్యాసాగర్‌రావు సలహాల మేరకు అఫిడవిట్లు తయారయ్యాయి. విభజన చట్టం ద్వారా ఏర్పాటై న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాల్లో విద్యాసాగర్‌రావు సమర్థవంతంగా వాదనలు వినిపించా రు. ఆయన వాదనల ధాటికి తట్టుకోలేక, ఆయన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక బోర్డులో ఆయన పాల్గొనడాన్నే ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ఏర్పాటైన బజాజ్‌ కమిటీ రెండు రాష్ర్టాల పర్యటనకు వచ్చింది. తొలిరోజు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రతినిధులతో సమావేశం జరిగింది. రెండోరో జు అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిని ధులతో సమావేశమయ్యారు. మూడోరోజు రెండు రాష్ర్టాల సంయుక్త సమావేశం జరిగింది. తెలంగాణ ప్రతినిధి బృం దానికి నాయకత్వం వహించింది విద్యాసాగర్‌రావే. ఆంధ్రప్రదేశ్‌ పట్టిసీ మ నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో తెలంగాణ వాటా ఏమిటో తేల్చవలసి న అంశం తమ పరిధిలో లేదని రెండు రాష్ర్టాల సంయుక్త సమావేశంలో బజాజ్‌ ప్రకటించారు. ఇది మొదటిరోజు బజాజ్‌ కమిటీ వెల్లడించిన వైఖరికి పూర్తిగా భిన్నం. దీంతో విద్యాసాగర్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ అంశం మీ పరిధిలో లేక పోతే ఈ సమావేశాల కోసం పర్యటన ఎందుకు జరుపుతు న్నట్లు, మీ వైఖరి శోచనీయం మిస్టర్‌ బజాజ్‌' అని నిష్కర్ష గా ప్రశ్నించారు. ఇట్లా అవసరమైతే తెలంగాణ ప్రయోజ నాల కోసం మర్యాదలను పక్కనపెట్టి మాట్లాడేవారు. ఇది ఆయన వ్యక్తిత్వంలో మరో పార్శ్వం.

విద్యాసాగర్‌రావు ‘నీళ్ళు-నిజాలు’ రచయితగానే తెలం గాణ ఉద్యమశ్రేణులకు  తెలుసు. అయితే ఆయనలో ఉత్తమమైన సాహిత్య పిపాసి కూడా ఉన్నాడు. తొలినాళ్లలో ఆయన కవిత్వం కూడా రాశారు. ‘ప్లస్‌ మైనస్‌' అనే కవిత్వ సంపుటాన్ని కూడా ప్రచురించారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉన్నప్పుడు నాటకాలు రాయడం, ప్రదర్శిం చడం, నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరించడం, రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టు రాయడం ద్వారా తన సాహిత్య దాహాన్ని తీర్చుకున్నారు. తాను రాసిన ఒక డజను నాట కాలను ప్రచురించి, ఒక మూడు రోజుల పాటు ప్రదర్శిస్తే చూడాలని ఆయన కోరుకున్నారు. పుస్తకం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ లోపల ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత మంత్రి హరీశ్‌రావు సహకారంతో  రవీం ద్రభారతిలో నాటకోత్సవం ఘనంగా జరిగింది. అప్పుడే ఆయన నాటకాల పుస్తకం కూడా విడుదలైంది. ఆయన మరణం తర్వాత ‘నీళ్ళు-నిజాలు’ మూడవ సంపుటం కూడా ఇంజినీర్ల జేఏసీ పక్షాన ప్రచురించాం.

సూర్యాపేట జిల్లాలోని తన పుట్టినూరు జాజిరెడ్డిగూడెం ను విద్యాసాగర్‌రావు ఎప్పుడూ మరువలేదు. తమ పూర్వీ కుల నుంచి వచ్చిన ఇంటిని కూల్చి ఆ స్థలాన్ని కళ్యాణమం డపం నిర్మాణం కోసం ఇచ్చారు. మంత్రి హారీశ్‌రావు చేత  శంఖుస్థాపన జరిగింది. తన చొరవతో జాజిరెడ్డి గూడెంలో ఒక మార్కెట్‌ యార్డు కూడా మంజూరైంది. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మీనరసింహస్వామి దేవాలయాభివృద్ధి కోసం స్వయంగా మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌లను కలిసి సంబంధించిన దస్ర్తాన్ని ముఖ్యమం త్రి ఆమోదం కోసం పంపించడంలో కృషిచేశారు. విద్యాసాగర్‌రావు కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌రూ.కోటి మంజూరు చేశారు. జీవో వచ్చేనాటికి ఆయన స్పృహలో లేరు. వారి కుటుంబసభ్యుల కోరిక మేరకు నేనే జీవో కాపీ ని ఆయన చేతిలో పెట్టి ‘సార్‌ అర్వపల్లి జీవో  తెచ్చా ను, నాటకాల పుస్తకం అచ్చయ్యింది, కళ్యాణమంటపం పనులు ప్రారంభమయ్యాయ’ని చెవిలో గట్టిగా చెప్పాను. విన్నారో లేదో ఆయనకే ఎరుక. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిం డి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టి ఆయ న పేరును శాశ్వతంగా నిలిచిఉండేలా చేశారు. ఆచార్య జయశంకర్‌సారుతో పాటు నీళ్ల సార్‌ విద్యాసాగర్‌రావును కూడా తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు.

(వ్యాసకర్త: ముఖ్యమంత్రి ఓఎస్డీ)


logo