గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 24, 2020 , 23:59:47

పరిశోధనల్లో పోటాపోటీ

పరిశోధనల్లో పోటాపోటీ

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ జెన్నేర్‌ పరిశోధనా సంస్థ 18 నుంచి 55 ఏండ్ల వయస్సున్న 510 వలంటీర్లపై పరిశోధన సాగిస్తున్నది. ఈ వాక్సిన్‌ సఫలమయ్యే అవకాశం 80 శాతం ఉన్నదని రీసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సారా గిల్బెర్ట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ కల్లా లక్షలాది ఔషధాలను అందించగలమని తెలిపారు.

కరోనా వైరస్‌ను నిరోధించడానికి భవిష్యత్తులో తయారుచేసే వాక్సిన్‌ను అన్నిదేశాలకు న్యాయబద్ధంగా సమర్థవంతంగా, వేగంగా పంపిణీ చేయాలని ఏప్రిల్‌ 20వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పోషించిన కీలకపాత్రను ఈ తీర్మానం ఎత్తిచూపింది. మెక్సికో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అమెరికా కూడా మద్దతు ఇచ్చింది. వాక్సిన్‌ను కనిపెట్టడంలో అంతర్జాతీయంగా ప్రైవేటు సంస్థలతో సహా సహకారం, సమన్వయం నెలకొనాలని ఈ తీర్మానం పేర్కొన్నది. 

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా జనాన్ని బాధిస్తూ లక్షా డబ్భు వేల మందికిపైగా ప్రాణాలను హరించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు పరిశోధనా సం స్థలు పోటాపోటీగా ప్రరిశోధనలు సాగిస్తున్నా యి. పరీక్షల పరికరాలు, ఔషధాలు వేగంగా అందరికీ సరఫరా అయ్యేవిధంగా చూడాలని ఈ తీర్మానం ద్వారా ప్రపంచ దేశాలు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ను కోరాయి. వాక్సిన్లు, ఔషధాలు వర్ధమాన దేశాలకు అందుబాటులో ఉండాలనేది కూడా ఈ తీర్మానంలోని ప్రధానాంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం కరో నా వైరస్‌ కట్టడి చేసే విషయమై ప్రపంచవ్యాప్తంగా కనీసం డబ్భు పరిశోధనా ప్రాజెక్టులు సాగుతున్నాయి. కొలిషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపే ర్డ్‌ నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ) ఆధ్వర్యంలో వందకుపైగా పరిశోధనలు సాగుతున్నాయి. 

మనిషి జబ్బు పడకుండానే అతడి నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడమే వాక్సిన్‌ లక్ష్యం. ఈ సులభమైన పద్ధతిలో అనేక ప్రమాదకరమైన వ్యాధులను నివారించవ చ్చు. మనిషి శరీరంలోకి వైరస్‌, బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు ప్రవేశించినప్పుడు రోగ నిరోధక కణాల ఉత్పత్తి భారీగా సాగుతుంది. వ్యాధి తగ్గిన తర్వాత ఈ రోగ నిరోధక కణాలు తాము దాడిచేసిన క్రిములను గుర్తుంచుకుంటాయి.దీన్నే రోగనిరోధక స్మృతి అంటారు. ఆ తర్వాత కాలంలో ఈ సూక్ష్మ క్రిములు ఎప్పుడు దాడిచేసినా వీటిని గుర్తుంచుకున్న రోగ నిరోధక కణాలు వేగంగా స్పం దించి అంతమొందిస్తాయి. దీంతో మనిషి జబ్బు పడకుండా నిరోధిస్తాయి. దీన్ని సహజసిద్ధ క్రియాశీల రోగనిరోధకత అంటారు. పుట్టినప్పటి నుంచి ఎన్నోరకాల వైరస్‌లు, బాక్టీరి యా, ఇతర సూక్ష్మజీవులు దాడిచేస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఈ క్రిముల నుంచి రోగనిరోధక వ్యవస్థ మనిషిని కాపాడుతూ ఉంటుంది. ప్రమాదకర సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవ స్థ అనేకరకాల స్పందనలతో మైక్రోబులను తుదముట్టిస్తుంది. ఒకసారి వీటిని తుదముట్టించిన తర్వాత, ఇక జీవితాంతం వీటిని గుర్తుంచుకొని ఈ ప్రమాదం రాకుండా అప్రమత్తంగా ఉంటాయి.

 ఇక వాక్సిన్‌లు పనిచేసే విధానం పరిశీలి ద్దాం. బలహీనంగా ఉన్న సూక్ష్మ క్రిమి లేదా దాని అవశేషం, ఒక్కోసారి సూక్ష్మక్రిమిని పోలి న పదార్థాన్ని మనిషి శరీరంలోకి ప్రవేశపెడుతారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ అప్రమత్త మై ఆ సూక్ష్మ క్రిమిని అంతమొందిస్తుంది. నిజమైన సూక్ష్మ క్రిములు ప్రవేశించినప్పుడు కూడా రోగ నిరోధక వ్యవస్థ దాడిచేసే స్థాయికి చేరుకుంటుంది. దీనిని కృత్రిమ ఆపాదిత క్రియాశీల రోగనిరోధకత అంటారు. 

ఈ వాక్సిన్‌ల రూపకల్పనకు ఒకప్పడు 15 నుంచి 20 ఏండ్లు పట్టేది. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం, గత అనుభవాల మూలంగా వాక్సి న్‌ తయారీ వేగం పుంజుకున్నది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌ వాక్సిన్‌పై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. జర్మనీ, యూకే దేశాల్లో మానవులపై ప్రయోగాల దశ సాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 వాక్సి న్‌ రూపకల్పన ప్రాజెక్టులు సాగుతున్నప్పటికీ జర్మనీ, బ్రిటన్‌లలోని ఐదు పరిశోధనలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది.ఒక వాక్సిన్‌ తయా రు చేయాలంటే ఆరు దశలుంటాయి. వైరస్‌ను విశ్లేషించడం, వాక్సిన్‌ రూపకల్పన, జంతువుల పై ప్రయోగం, వలంటీర్స్‌పై ప్రయోగం, తయా రీ విధానానికి, ఆమోదం పొందడం భారీ ఉత్పత్తి అనేవి ఈ దశలు.

 ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ జెన్నేర్‌ పరిశోధనా సంస్థ 18 నుంచి 55 ఏండ్ల వయస్సున్న 510 వలంటీర్లపై పరిశోధన సాగిస్తున్నది. ఈ వాక్సిన్‌ సఫలమయ్యే అవకాశం 80 శాతం ఉన్నదని రీసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సారా గిల్బెర్ట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ కల్లా లక్షలాది ఔషధాలను అందించగలమని తెలిపారు.

జర్మనీలో పాల్‌ ఎర్లిచ్‌ పరిశోధనా సంస్థ (పీఈఐ) వలంటీర్లపై పరిశోధనకు అనుమతి పొందింది. జర్మన్‌ సంస్థ బయాంటెక్‌ రూపొందించిన వాక్సిన్‌ను ఈ సంస్థ పరిశీలించి చూస్తున్నది. ఈ వాక్సిన్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పీఐఈ సంస్థ వెల్లడించింది. జర్మనీ, యూకే దేశాలే కాకుం డా అమెరికా, చైనా దేశాలు కూడా వేగంగా అడుగులు వేస్తున్నాయి. చైనా సైన్యానికి సంబంధించిన వైద్యశాస్త్ర అకాడమీ హం కాంగ్‌కు చెందిన ‘కాన్‌సినో బయో’ ప్రయో గాలు సాగించడానికి చైనా ప్రభుత్వం ఆ తర్వాత మార్చి 16న అనుమతించింది. ఇదే రోజున అమెరికా ఔషధ తయారీ సంస్థ మాడెర్నా మానవులపై ప్రయోగాలను ప్రారంభించింది. అమెరికాకే చెందిన మరో సంస్థ ఇనోవియో ఫార్మాస్యూటికల్స్‌ కూడా ఏప్రిల్‌ 6న మనుషులపై ప్రయోగాలు ప్రారంభించింది.

కరోనా వైరస్‌కు వాక్సిన్‌ కోసం పరిశోధనలు సాగుతున్న సందర్భంగా దేశాల మధ్య ఒకింత విభేదాలు కూడా పొడసూపాయి. క్యూర్‌ వ్యాక్‌ అనే జర్మనీ సంస్థ సాగిస్తున్న పరిశోధనలపై ప్రత్యేక హక్కులు కొనుక్కోవడం కోసం అమెరికా ప్రయత్నిస్తున్నదం టూ ఒక వార్తా పత్రిక గత నెలలో ఒక వార్త ను ప్రచురించింది. క్యూర్‌వ్యాక్‌తో పాటు అమెరికా అధికారులు ఈ వార్తను ఖండించారు. అయినప్పటికీ జర్మనీలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో జర్మనీ ఆర్థిక మంత్రి పీటర్‌ఆల్ట్‌ మెయిర్‌ ‘జర్మనీ అమ్మకానికి లేదంటూ’ ప్రకటించవలసి వచ్చింది. వాక్సిన్‌ పరిశోధన కోసం జర్మనీ ప్రభుత్వం నూట నలభై ఐదు మిలియన్‌ యూరోలను అదనంగా విడుదల చేసింది.సీఈపీఐ వాక్సి న్‌ పరిశోధనలకు ఈ నిధులను ఉపయోగిస్తారు. ఐరాస తీర్మానంలో పేర్కొన్నట్టు కరోనా వైరస్‌ కట్టడికి తయారుచేసే వాక్సిన్‌ పేద, ధనిక తేడా లేకుండా అన్నిదేశాల్లోని ప్రజలకు వేగంగా అందుతుందని ఆశిద్దాం.

(వ్యాసకర్త: వేములవాడ శాసనసభ్యులు: డాక్టర్‌ రమేశ్‌ చెన్నమనేని )


logo