మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Apr 24, 2020 , 23:56:10

కరోనానూ జయిస్తాం

కరోనానూ జయిస్తాం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దార్శనికత, మానవతావాదం మరోసారి నిరూపితమైంది. లాక్‌డౌన్‌ను మే 7 దాకా పొడిగించాలని నిర్ణయించడమే కాకుండా ప్రజ లు ఎవరు పస్తులుండకూడదనే సంక ల్పంతో రేషన్‌కార్డు దారులకు మరో విడుతగా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయించడం ప్రజలకు గొప్ప ఊరట. కరోనాపై కొందరు మాటలతోకాలక్షేపం చేస్తుం టే కేసీఆర్‌ చేతలతో తెలంగాణకు వెయ్యేనుగుల బలాన్ని, నైతిక ైస్థెర్యాన్నిస్తున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటున్నది.

కరోనా వైరస్‌ ప్రభావం ముందే పసిగట్టిన కేసీఆర్‌ కరోనాపై యుద్ధం ప్రకటించారు. పోరాడి రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ రాష్ట్రంపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కరోనాకు చెక్‌పెట్టేందుకు కేసీఆర్‌ దానికి లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని చెప్పడంతో ప్రజలంతా ఏకతాటిపై నిలబడటం ముదావహం.

ఆపత్కాలంలో ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సాయం అత్తెసరు చందంగానే ఉన్నది.రాష్ట్ర ప్రభు త్వం తన సొంత వనరులతో ఆదుకుందామంటే లాక్‌డౌన్‌తో రోజుకు రూ.400లు కోట్లు వచ్చే ఆదాయం కేవలం రూ.కోటికే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం రాష్ర్టాలను ఆదుకోకుండా తన బాధ్య త నుంచి తప్పుకుంటున్నది. అంతేగాక ఇదే అదనుగా తమ రహస్య ఎజెండాను అమలుచేసుకునేందుకు కరోనా వ్యాప్తిని అవకాశంగా ఉపయోగించుకోవడం గర్హనీయం.

దేశానికి వ్యవసాయమే జీవిక. దేశానికి అన్నంపెట్టడమే కాదు, వ్యవసాయం ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. మనం ఆహారధాన్యాల విషయంలో స్వయం సమృ ద్ధితో ఉన్నాం. ఈ పరిస్థితి కొనసాగాలని,వ్యవసాయాన్ని ‘నరేగా’తో అనుసంధానం చేయాలని కేసీఆర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయాల్లో గత ప్రభుత్వాలు ఏం చేశా యో గుర్తుచేశారు.

1918లో స్పానిష్‌ఫ్లూ వచ్చినప్పు డు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షో భం ఏర్పడింది. ఆ తర్వాత 2008 లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడింది. వీటికి సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకో గలిగారని కేసీఆర్‌ వివరించారు. ఇక రాష్ర్టాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీ సం ఆర్నెల్ల పాటు వాయిదా వేసేలా కేంద్రం చొరవ తీసుకుంటే కొంత వెసులుబాటు వస్తుందని ఆశపడిన తెలంగాణకు కేంద్రం నుంచి ఏ ఒక్క హామీ రాకపోవడం ఆందోళనకరమై న విషయం.

క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికా ప్టర్‌ మనీ విధానాలనూ ముఖ్య మం త్రి కేసీఆర్‌ కేంద్రానికి సూచించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా కేంద్రం నిధులు సమకూ ర్చి రాష్ర్టాలను ఆదుకోవాలి. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా కేసీఆర్‌ అడుగుజాడల్లో తెలంగాణ ప్రజలు అధిగమించి తీరుతారనటంలో సం దేహం లేదు.

(వ్యాసకర్త: నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే)


logo