గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 23, 2020 , 22:24:38

కరోనా కలిపిన బంధం

కరోనా కలిపిన బంధం

మనిషి అందివచ్చిన అవకాశాలు, టెక్నాలజీకి అలవాటుపడి ఏదో సాధించాలనే ఆరాటంలో విలువల ను సైతం మరిచాడు. పక్కవారి సం గతి పక్కనపెడితే కుటుంబసభ్యుల ను కూడా పట్టించుకునే తీరిక ఉండ టం లేదు. ఒక్కసారిగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఆవరించేసరికి, డబ్బులె న్ని ఉన్నా, కోల్పోయిన విలువలను, ఆప్యాయతలను పొందలేమని తెలిసివచ్చింది. కృత్రిమ సుఖాలు, భోగాల కోసం దేశాలు తిరిగిన మనిషికి అసలైన తృప్తి, సంతోషం తనవాళ్ల మధ్య నే దొరుకుతుందని అర్థమైంది.

అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతున్నది. అత్యధిక కరోనా మరణాలను చవిచూస్తున్నది. అమెరికా పరిస్థితి ఎం దుకీ స్థితి వచ్చింది? కర్ణుడి చావుకు కారణలెన్నో అన్నట్లు, అమెరికాలో కరోనా విజృంభణకు అనేక కారణా లు. చీమ చిటుక్కుమన్నా పదుల సంఖ్యలో ప్రత్యక్షమయ్యే పోలీసులు న్న ఈ దేశం పరిస్థితి విషమించేవర కు ఎందుకు మేల్కొనలేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నిఘా విభాగానికి పెట్టింది పేరు అమెరికా.  ముందుగానే ఇండియా వలె అంతర్జాతీయ విమానాలను ఎందుకు కట్ట డి చేయలేదనేది జవాబు లేని ప్రశ్న.

అమెరికా అంటే స్వేచ్ఛకు ప్రతీక. ఇక్కడ ఒక్కో రాష్ర్టానికి ఒక్కో చట్టం. అమెరికా పౌరులు కుప్పలుగా మరణిస్తుంటే, ఎమర్జెన్సీ మెడికల్‌ కిట్స్‌ ఇవ్వడం రాష్ట్రం బాధ్యతనా, లేక కేం ద్రం బాధ్యతనా అని మీడియాలో చర్చలు జరుగడం ఎంత బాధ్యతారాహిత్యం! నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీస్‌ యాజమాన్యానికి, సీడీ సీ లాంటి సంస్థలకు,  ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించడం కూడా కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోవడానికి ఒక కారణం.

ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రో ల్‌) వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌తో కలిసిపనిచేయడం సాధారణం. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేయడంతో కొత్త సమ స్యలు మొదలయ్యాయి. ఇక సామాజిక దూరం, పౌరుల బాధ్యత గురిం చి చూస్తే మరింత బాధాకరం. అమెరికాలో బాధ్యతాయుత పౌరులుగా అందరూ లాక్‌డౌన్‌ను పాటించకపోవడమే ఈ కరోనా విలయతాండవానికి కారణమని చెప్పవచ్చు.

అమెరికాలో ఇన్నిరోజులు ఉరుకు లు పరుగులతో ఉద్యోగం చేసిన భారతీయులు భార్యాపిల్లలకు సమ యం వెచ్చించలేదు. లాక్‌డౌన్‌తో అవకాశం వచ్చింది. అమ్మచేతి కమ్మదనం, భారతీయ వంటల రుచులు కరోనాతో తెలిసివచ్చాయి. అందరూ కుటంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇది అందరికీ ఒక కొత్త ఉత్సాహాన్నిస్తున్నది.

లాక్‌డౌన్‌ కాలం మనిషిలో దానగుణాన్ని పెంచి ఆత్మీయతకు తెరలేపింది. ఉద్యోగాలున్న భారతీయులు, ఉపాధి కోల్పోయినవారికి చారిటీ ద్వారా సాయం చేస్తున్నారు. ‘బతు కు, బతుకనివ్వు’ అనే నినాదాన్ని ఒక ఉద్యమం వలె అమలుచేస్తున్నారు. కరోనా మహమ్మారి మానవాళికి ఎం తో చెడు చేసింది. ఆ చెడులోనే మం చితనాన్ని లాక్‌డౌన్‌లో వెతుక్కుం దాం. సామాజిక దూరాన్ని పాటిస్తూ ధైర్యంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం.


logo