శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 21, 2020 , 22:46:23

కరాళ నృత్యం

కరాళ నృత్యం

కనిపించని దేవుళ్ళను కళ్ళెదురుగ చూస్తున్నం

ప్రాణాలను అడ్డువేసి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న

డాక్టర్లు, సిస్టర్లు, ఆరోగ్య సిబ్బంది

పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు..

కనపడని యమభటుల కళ్ళారా చూస్తున్నం

కరోనా రూపంలో-కరోనా రూపంలో

తనను చంపే మందే లేదని చేస్తున్నది

కరోనా నృత్యం-కరాళ నృత్యం..!

గొప్ప గొప్ప దేశాలు ఆగమాగమౌతున్నయ్‌

అమెరికాలో ప్రతిరోజు వేలల్లో మరణాలు

ఇంగ్లండ్‌ ప్రధానిని వదల్లేదు కరోనా

పెద్దోళ్ళు చాలామంది క్వారంటైనౌతున్నరు..!

అడుగు బయటపెట్టొద్దు, కరోనాను ఇంట్లోకి తేవద్దు

సబ్బుతో చేతులు కడిగితే.. కరోనాకు మరణం

మాస్కులు వాడితే.. కరోనాకు ఆకలిచావే

భౌతిక (సామాజిక)దూరంతో కరోనా ఇక కాటికే..!

పాలకుల ముందుచూపు.. ప్రజలకది రక్ష

కట్టడి తప్పితే చివరికి మిగులుతుంది మచ్చ

లాక్‌డౌన్‌ పాటిద్దాం.. లోకాన్ని బతికించుకుందాం

కేసీఆర్‌ గారి మాట విందాం..

తెలంగాణ భేష్‌ అనిపించుకుందాం..!


logo