ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Apr 20, 2020 , 23:03:07

సంక్షోభ పరిష్కారమేది?

సంక్షోభ పరిష్కారమేది?

కరోనా వైరస్‌ కట్టడి కోసం సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు పేద, మధ్యతరగతి ప్రజల బతుకులకు భరోసా కల్పిస్తున్నవి. కరోనా తీవ్రతను, ఆర్థికసంక్షోభాన్ని కేసీఆర్‌ ముందే అంచనా వేశారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ను అరికట్టడానికి అమలవుతున్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నారు. సంక్షోభంలో కూరుకుపోతున్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి, ఆర్థికంగా చితికిపోతున్న పేద, మద్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకోవడానకి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలకమైన ఆర్థికచర్యలను ప్రతిపాదించారు. ఈ చర్యలను దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా బలపర్చటం గమనార్హం.

కరోనా కాటుకు దేశ ఆర్థికరంగం ఛిన్నాభిన్నమైంది. ‘కేర్‌ రెటింగ్‌ సంస్థ’ 21రోజుల లాక్‌డౌన్‌ ఫలితంగా 9.4 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టపోయిందని అంచనా వేసింది. ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయింది. ఈ వృద్ధిరేటు మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయి కి పడిపోతుందని అంచనా వేసిన ప్రపంచబ్యాంకు 2020-21లో దేశ జీడీపీ వృద్ధిరేటు 1.5-2.8 శాతం మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. ఇప్పటికే 4 కోట్ల మంది పనిచేసే టూరిజం పరిశ్రమలో 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎగుమతి రంగంలో 1.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌' అంటున్నది. చేతివృత్తులు, ఆభరణాల తయారీ మొదలగు రంగా లు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు 80 శాతం ప్రాజెక్టులు అమెరికా, యూరప్‌ల నుంచే వస్తాయి. ఈ దేశాల ఆర్థికవ్యవస్థలు దెబ్బతింటున్న ప్రభావం ఇక్కడి ఐటీ ఉద్యోగాలపై కూడా ఉంటుంది.

లాక్‌డౌన్‌ ఫలితంగా దేశంలో ఇన్ఫార్మల్‌ సెక్టార్‌కు (స్వయం ఉపాధి, దుకాణాలు, తక్కువ వేతనం పొందే శ్రామికులు) సంబంధించిన 40 కోట్ల మంది పేదరికంలోకి కూరుకుపోయారని ఐఎల్‌ఓ పేర్కొన్నది. సం క్షోభ కాలంలో రైతులు పండించిన పంటల ను ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోతే రైతులు, కూలీల ఆదాయం తీవ్రంగా పడిపో యే అవకాశం ఉన్నది. ఇది ఆర్థికసంక్షోభాన్ని మరింత పెంచుతుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఆచరణాత్మకమైన పరిష్కారమార్గాలను కేంద్రం ముందుంచారు. అందులో ముఖ్యమైనది ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాఫ్టర్‌ మనీ  విధానాలను అమలుజరుపడం. ఈ క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాఫ్టర్‌ మనీ అనేవి ద్రవ్యపరమైన చర్యలు. ఈ విధానాలు 19 29-30లో ఏర్పడిన మహా సంక్షోభం నుం చి గట్టెక్కడానికి ఉపయోగపడిన బ్రిటన్‌ ప్రముఖ ఆర్థికవేత్త జాన్‌మెనార్డ్‌ కీన్స్‌ డిమాం డ్‌ సిద్ధాంతం నుంచి పుట్టిన భావనలు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీ విధానాలే ఉత్తమం. అయితే ఈ విధానాల ద్వారా ఆర్థికవ్యవస్థలోకి ప్రవేశించిన డబ్బు, మార్కెట్లో వస్తుసేవల డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అనుత్పాదక ఖర్చులు జరుగకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కగలం.

క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటే.. రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్లను (నోట్ల ముద్రణ) ముద్రించి, వడ్డీ లేకుండా బ్యాంకులకు అప్పులు, ప్రభు త్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాలకు ఇస్తుంది. అలా ఇచ్చిన డబ్బు బ్యాంకులు, ప్రభుత్వాల ద్వారా వివిధ వర్గాలకు పంపిణీ చేస్తూ ఆర్థికవ్యవస్థను గాడిలో పెడుతుంది. హెలికాప్టర్‌ మనీ విధానంలో రిజర్వ్‌బ్యాంక్‌ ద్వారా ముద్రించబడిన నోట్లు ప్రభుత్వాలు నిర్దేశించిన వివిధ వర్గాల ప్రజల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా చేరవేస్తారు. ప్రజలు వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రెండు విధానాల అర్థాలు వేరైనా, వాటి ముఖ్య ఉద్దేశం దేశ ఆర్థికవ్యవస్థలోకి డబ్బు పంపిణీ చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే. తద్వారా వస్తుసేవలను ఉత్పత్తి చేస్తూ ఉపాధి కల్పిస్తారు. ఈ చర్యల వల్ల ఆర్థి క సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాజంలో ఉన్న వివిధ రం గాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన దేశ జీడీపీ విలువలో 5 శాతాన్ని నగదుగా రిజర్వ్‌ బ్యాంకు ముద్రించి ఆర్థికవ్యవస్థలోకి వివిధ రూపా ల్లో (ఇన్ఫార్మల్‌ రంగానికి, అసంఘటితరంగానికి, నిరుపేదలకు, రైతాంగం, కూలీలు మొదలగు వారికి) పంపిణీ చేయాలని సూచించారు. కేంద్ర గణాంకాల శాఖ  ప్రకా రం 2019-20లో భారతదేశ జీడీపీ రూ.203.85 లక్షల కోట్లు. దీని ప్రకారం 5 శాతం అంటే, 10.15 లక్షల కోట్లు అవుతుం ది. ఇది పంపిణీ చేయాలి. ఇప్పటికే ఈ విధానాలను అభివృద్ధి చెందిన దేశాల బ్యాంకులు అమలుచేశాయి.

కరోనా విపత్కర పరిస్థితుల్లో క్వాంటిటేటి వ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీ విధానాలే ఉత్త మం. అయితే ఈ విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించిన డబ్బు, మార్కెట్లో వస్తుసేవల డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అనుత్పాదక ఖర్చులు జరుగకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కగలం.

1929లో కీన్స్‌ సిద్ధాంతాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ అమలుచేసి అమెరికాను మహా సంక్షోభం నుంచి గట్టెక్కించాడు. రూ.లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ మాత్రమే ప్రకటించిన ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన ఆచరణాత్మక పరిష్కారమార్గాలను అమల్లోకి తెచ్చి కరోనా సంక్షోభం నుంచి దేశా న్ని గట్టెక్కించాలి.


logo